నిలకడగా బంగారం ధరలు .. ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉండదంటే.!

Updated on 12-Sep-2022
HIGHLIGHTS

గడచిన వారాంతం నుండి మార్కెట్లో బంగారం ధర నిలకడగా వుంది

ఈరోజు కూడా బంగారం ధరలో ఏటివంటి మార్పు లేకపోవడం గమనార్హం

ఈరోజు దేశవాప్తంగా బంగారం ధర

గడచిన వారాంతం నుండి మార్కెట్లో బంగారం ధర నిలకడగా వుంది. ఈరోజు కూడా బంగారం ధరలో ఏటివంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఇక సెప్టెంబర్ నెల మొదటి నుండి ఇప్పటి వరకూ బంగారం ధరలను చూస్తే, ప్రారంభ తేదికి 50,730 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర, ఈరోజు 51,010 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు దేశవాప్తంగా బంగారం ధర ఎలా కొనసాగుతుందో పరిశీలిద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,750 రూపాయలుగా ఉండగా, ఈరోజు కూడా  46,750 రూపాయల వద్దే కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,010 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,010 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,010 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,010 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :