Gold Price: నిన్న పెరిగి ఈరోజు తగ్గిన గోల్డ్ రేట్..!
గోల్డ్ రేట్ పసిడి ప్రియులను అయోమయంలో పడేస్తోంది
నిన్న పెరిగి ఈరోజు తగ్గిన గోల్డ్ రేట్ పసిడి
గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం అంచనాలకు అందకుండా సాగుతోంది
Gold Price: నిన్న పెరిగి ఈరోజు తగ్గిన గోల్డ్ రేట్ పసిడి ప్రియులను అయోమయంలో పడేస్తోంది. వాస్తానికి, గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ నెలలో గోల్డ్ మార్కెట్ ఆల్ టైమ్ హై రేట్ ను నమోదు చేసిన విషయం తెలిసిందే మరియు నిపుణుల అంచనా కూడా గోల్డ్ 65 వేల మార్క్ ను తాకవచ్చని చెబుతున్నారు. అయితే, రెగ్యులర్ గా మార్కెట్ ను ఫాలో అవుతున్న మరియు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు గోల్డ్ మార్కెట్ అంచాలకు అందకుండా పరిగెడుతోంది.
Gold Price Today:
ఈరోజు మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా నష్టాలను చవి చూసి రూ. 60,930 వద్ద ముగిసింది. ఇది 24K స్వచ్ఛమైన గోల్డ్ ప్రైస్ మరియు 10గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 55,850 రూపాయల వద్ద ముగిసింది. ఈరోజు గోల్డ్ మార్కెట్ గ్రాముకు 22 రూపాయల (తులానికి 220) క్రిందకు దిగింది.
ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్
ఇక మొత్తంగా ఈ వారం గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగిందని చూస్తే, ఈ వారం రూ. 61,030 వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్ ఈరోజు రూ. 60,930 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ వారం గోల్డ్ మార్కెట్ దాదాపుగా స్థిరంగానే వుంది. అయితే, గత వారం మాత్రం గోల్డ్ మార్కెట్ భారీ హెచ్చు తగ్గులను చవి చూసింది.
తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ మార్కెట్
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడ లలో గోల్ మార్కెట్ లైవ్ ధరలను చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22K గోల్డ్ ధర రూ. 55,850 వద్ద కొనసాగుతుండగా, రూ. 60,930 రూపాయల వద్ద 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ కొనసాగుతోంది. విజయవాడ లో కూడా ఇదే ధరలను గోల్డ్ రేట్ నమోదు చేసింది.
గమనిక: ఇక్కడ అందించిన గోల్డ్ రేట్ పూర్తిగా Live Rates. ఈ ధరలో మార్పులు జరగవచ్చు మరియు లోకల్ మార్కెట్ రేట్ తో సరిపోలక పోవచ్చు.