మే 22 గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!
పసిడి మార్కెట్, ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది
గత వారం ప్రారంభం నుండి భారీగా తగ్గిన బంగారం
గోల్డ్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి
దేశవ్యాప్తంగా మే 21న భారీగా పెరిగిన పసిడి మార్కెట్, ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. గత వారం ప్రారంభం నుండి భారీగా తగ్గిన బంగారం ధర, రూ. 2000 నోటును రద్దు చేస్తునట్లు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా తులానికి 550 రూపాయల పెరుగుదలను చూసింది. అయితే, ఈరోజు (మే 22) గోల్డ్ మార్కెట్ నిలకడగా కొనసాగుతోంది.
మే 22 గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్:
ఇక ఈ రోజు అనగా మే 22 గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 61,410 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా, 10 గ్రాముల 22 క్యారెట్ పసిడి ధర రూ. 56,290 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల లోని చాలా ప్రధాన నగరాలలో ఇదే ధర వద్ద పసిడి కోనసాగుతోంది.
ఈరోజు ఢిల్లీ, జైపూర్ లక్నో మరియు చండీఘడ్ లలో ఇక తులం 24K గోల్డ్ రేట్(10గ్రా) రూ. 61,560 వద్ద కొనసాగుతుండగా, 22K గోల్డ్ రేట్ (10గ్రా) రూ. 56,440 వద్ద కొనసాగుతోంది.
దేశం మొత్తం మీద చెన్నై, మధురై, కోయంబత్తూర్ మరియు సేలం మార్కెట్ లలో పసిడి అధిక రేట్ ను నమోదు చేసింది. ఈ మార్కెట్ లలో 10 గ్రాముల 24K బంగారం ధర రూ. 61,950 గా ఉండగా, 10 గ్రాముల 22K బంగారం ధర రూ. 56,750 వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఆన్లైన్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించ గలరు.