గత శనివారం క్రిందకు దిగిన గోల్డ్ రేట్, ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. గత వారం భారీ మార్పులు చూసిన గోల్డ్ మార్కెట్ సూచీలు ఈరోజు మాత్రం నిలకడగా ఉన్నాయి. అయితే, ఈ ఏప్రిల్ నెల ప్రారంభం నుండి గోల్డ్ మార్కెట్ ను పరిశీలించినట్లయితే బంగారం ధర దాదాపుగా 1,000 రూపాయలకు పైగానే పెరుగుదలను నమోదు చేసింది. అందుకే, ఈరోజు లైవ్ అప్డేట్ తో పాటుగా ఈ నెల గోల్డ్ మార్కెట్ వివరాలను పరిశీలిద్దాం.
ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ విషయానికి వస్తే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10గ్రాముల 22K గోల్డ్ రేట్ 55,960 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదేవిధంగా 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ 61,050 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే, శనివారం 750 రూపాయలకు పైగా పతనాన్ని చూసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు స్థిరంగా వుంది.
ఇక ఈ నెల గోల్డ్ మార్కెట్ ను సవివరంగా పరిశీలిస్తే, ఈ నెల ప్రారంభంలో రూ.55,010 రూపాయల వద్ద ప్రారంభమైన 10గ్రాముల 22K పసిడి ధర ఈరోజు రూ.55,960 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.60,010 రూపాయల వద్ద ప్రారంభమైన 10గ్రాముల 24K స్వచ్ఛమైన బంగారం ధర ఈరోజు రూ.61,050 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈ రెండు వారాల్లో బంగారం ధర ఓవర్ఆల్ గా 1,000 రూపాయలకు పైగా పెరిగినట్లు మనం చూడవచ్చు.
అయితే, ఈ రెండు వారాల సమయంలో గోల్డ్ మార్కెట్ భారీ హెచ్చు తగ్గులను నమోదు చేయడం మనం చూడవచ్చు. ఈ 15 రోజుల్లో ఏప్రిల్ 3న డౌన్ ఫాల్ అయిన గోల్డ్ మార్కెట్ ఒక తులం 22K గోల్డ్ రేట్ 54,710 వద్ద మరియు తులం 24K గోల్డ్ రేట్ 59,680 రూపాయల వద్దకి దిగింది. అయితే, రెండు రోజుల్లోనే పుంజుకున్న గోల్డ్ మార్కెట్ ఏప్రిల్ 5న 10gr 22K గోల్డ్ రేట్ ను 56,250 గా మరియు 10gr 24K గోల్డ్ రేట్ 61,370 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, ఈ నెలలో ఏప్రిల్ 14న ఆల్ టైమ్ హై రేట్ ను గోల్డ్ మార్కెట్ హిట్ చేసింది.