ఈరోజు స్థిరంగా పసిడి ధరలు..లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!

ఈరోజు స్థిరంగా పసిడి ధరలు..లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

ఈరోజు గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది

ఇప్పటికీ కూడా బంగారం ధర ప్రియంగా ఉందనే చెప్పాలి

ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ తెలుసుకోండి

ఈరోజు గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. ఈ వారంలో భారీ పెరుగుదలను నమోదు చేసిన తరువాత, పసిడి ధర నిలకడగా కొనసాగుతోంది. అయినా ఇప్పటికీ కూడా బంగారం ధర ప్రియంగా ఉందనే చెప్పాలి. అయితే, గోల్డ్ రేట్ మరింతగ పెరగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ ఎమిటో తెలుసుకుందాం పదండి. 

Gold Rate:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.55,900 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.100 రూపాయలు క్రిందకు దిగి రూ.55,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.60,980 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.60,870 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు బంగారం ధర రూ.110 రూపాయల తరుగుదలను చూసింది.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,870 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,870 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,020 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,530 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo