ఈరోజు స్థిరంగా బంగారం ధర..అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.!

ఈరోజు స్థిరంగా బంగారం ధర..అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.!
HIGHLIGHTS

గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధర ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది

గత నెల చివరిలో బంగారం ధర క్రిందకు దిగుతూ వచ్చింది

ఈరోజు అంచనాలను తల క్రిందులు చేస్తూ గోల్డ్ మార్కెట్ నిలకడగా కొనసాగుతోంది

గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధర ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. వాస్తవానికి, గత నెల చివరిలో బంగారం ధర క్రిందకు దిగుతూ వచ్చింది. అయితే, మార్చి నెల ప్రారంభం అవుతూనే బంగారం ధర పెరుగుదలను నమోదు చేసింది. మళ్ళి బంగారం ధర పెరగవచ్చని అంచనా వేస్తుండగా, ఈరోజు అంచనాలను తల క్రిందులు చేస్తూ గోల్డ్ మార్కెట్ నిలకడగా కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ దేశవ్యాప్తంగా మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దామా.   

Gold Price:

ఈరోజు ఉదయం రూ.51,750 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం స్థిరంగా రూ.51,750 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.56,450 రూపాయల వద్ద స్థిరంగా నిలబడింది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,600 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo