మే 29 గోల్డ్ రేట్: ఈరోజు గోల్డ్ మార్కెట్ పైన ఒక లుక్కేద్దాం పదండి.!

మే 29 గోల్డ్ రేట్: ఈరోజు గోల్డ్ మార్కెట్ పైన ఒక లుక్కేద్దాం పదండి.!
HIGHLIGHTS

గత వారం మొత్తం క్రిందకు దిగజారిన గోల్డ్ మార్కెట్ సూచీలు

గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం 60 వేల రూపాయల మార్క్ వద్ద నిలకడగా వుంది

ఈరోజు ప్రధాన మర్కెట్ లో గత వారం క్లోజింగ్ రేట్ వద్దనే కొనసాగుతోంది

మే 29 గోల్డ్ రేట్: ఈరోజు గోల్డ్ మార్కెట్ పైన ఒక లుక్కేద్దాం పదండి. గత వారం మొత్తం క్రిందకు దిగజారిన గోల్డ్ మార్కెట్ సూచీలు ఈరోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి. అంటే, ఈరోజు గోల్డ్ రేట్ లో ఎటువంటి  మార్పులు లేకుండా నిశ్చలంగా వుంది. గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం 60 వేల రూపాయల మార్క్ వద్ద నిలకడగా వుంది మరియు గత వారం మార్కెట్ పూర్తిగా నష్టాలను చూసింది. మరి ఈరోజు మర్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. 

ఈరోజు ప్రధాన మర్కెట్ లో గత వారం క్లోజింగ్ రేట్ వద్దనే కొనసాగుతోంది. ఈరోజు 10 గ్రాముల 24క్యారెట్ పసిడి ధర రూ. 60,600 రూపాయల వద్దనే కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ పసిడి ధర రూ. 55,550 రూపాయల వద్ద కొసాగుతోంది. అంటే, ఈ వారం స్టార్టింగ్ రోజు గోల్డ్ మార్కెట్ లో ఎటువంటి మార్పులు లేవు. 

తెలుగు రాష్ట్రలలో గోల్డ్ రేట్

ఈరోజు తెలుగు రాష్ట్రలలో గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు తెలుగుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో కూడా గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో ఒక తులం 24K గోల్డ్ రేట్ రూ. 60,600 వద్ద కొనసాగుతుండగా, ఒక తులం 22K గోల్డ్ రేట్ రూ. 55,550 గా వుంది. 

దేశంలో చాలా నగరాలలో ఇదే రేట్లు నమోదవ్వగా చెన్నై మరియు కోయంబత్తూర్ మార్కెట్ లలో ఈరోజు గోల్డ్ రేట్ అధికంగా నమోదయ్యింది. ఈరోజు ఈ రెండు మార్కెట్ లలో గోల్డ్ రేట్ 10 గ్రాముల 24K  గోల్డ్ రేట్ రూ. 60,980 రూపాయలుగా ఉండగా, 22K గోల్డ్ రేట్ రూ. 55,900 గా వుంది. 

గమనిక: ఇక్కడ అందించిన ఆన్లైన్ గోల్డ్ రేట్స్ మరియు లోకల్ మార్కెట్ రేట్ లావు మార్పులు సంభవించవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo