ఈరోజు మార్కెట్ లో Gold Rate శాంతించినట్లు కనిపిస్తోంది. గత 6 రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగింది. ఇప్పటికే, గడిచిన 6 రోజుల్లో తులానికి రూ. 1,300 రూపాయలకు పైగా పెరిగింది మరియు ఇంకా ఎంత పెరుగుతుందో అనే అంచనాలను కూడా రేకెత్తించింది. అయితే, అనుకున్న అంచనాలను తల్లక్రిందులు చేస్తూ ఈరోజు గోల్డ్ మార్కెట్ స్థిరంగా నిలిచింది.
ఈరోజు గోల్డ్ మార్కెట్లో ఎటువంటి మార్పులు లేవు మరియు ఈరోజు గోల్డ్ రేట్ రూ. 58,530 రూపాయల వద్దనే కొనసాగుతోంది.
అక్టోబర్ నెల గోల్డ్ మార్కెట్ లో మంచి మార్క్ ను వేసింది. ఈ నెలలో గోల్డ్ మార్కెట్ గత 8 నెలలలో ఎన్నడూ చూడనంతగా పతనమయ్యింది. ఈ నెలలో గోల్డ్ రేట్ 8 నెలల కనిష్ఠాన్ని చూడటంతో పాటు భారీ నష్టాలను మదుపరులకు రుచి చూపించింది. అయితే, వెంటనే కోలుకున్న గోల్డ్ మార్కెట్ 5 రోజుల్లోనే పుంజుకొని 58 మార్క్ వద్దకు చేసుకుంది.
అయితే, గోల్డ్ రేట్ దీపావళి పండుగ నాటికి 60 వేల మార్క్ ను చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ కూడా నిపుణుల అంచనాలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి.
Also Read : Amazon GIF 2023: బ్రాండెడ్ 5G Phones పైన జబర్దస్త్ ఆఫర్లు అందుకోండి | exciting Deals
ఈరోజు ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 24 carat బంగారం ధర స్థిరంగా నిలబడి రూ. 58,530 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఈరోజు దేశంలోని ప్రధాన మార్కెట్ లలో 10 గ్రాముల 22 caratఆర్నమెంట్ గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగి రూ. 53,650 రూపాయల వద్ద వుంది.
Also Read : Amazon సేల్ నుండి OnePlus 10R 5G పైన భారీ డిస్కౌంట్.. Offer Price ఎంతంటే.!
గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.