ఈ వారం ప్రారంభం నుండి 60 వేల మార్క్ దిగువున స్థిరంగా కొనసాగుతున్న Gold Rate ఈరోజు క్రిందకు దిగింది. ఇప్పటికే మార్కెట్ లో అస్థిరంగా ఉన్న గోల్డ్ మార్కెట్ ఈరోజు మళ్ళీ నష్టాలను చవి చూసింది. అయితే, ఇక్కడ మనం మాట్లడుకుంటోంది గోల్డ్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసే’ఇన్వెస్టర్ల గురించి మాత్రమే సుమండీ. ఎందుకంట, 10 గ్రాములు లేదా కొద్దీ మొత్తంలో గోల్డ్ కొనాలని చేసే వారి పైన ప్రస్తుత మార్కెట్ డౌన్ ఫాల్ అంతగా ప్రభావం చూపదు. ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు ఈరోజు లేటెస్ట్ బంగారం ధర వివరాలను తెలుసుకోండి.
ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. నిన్న మార్కెట్ లో రూ. 59,950 వద్ద కొనసాగిన బంగారం ధర ఈరోజు 10 గ్రాములకు రూ. 220 క్రిందకు దిగి రూ. 59,730 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read : Vivo V29 Series Launch డేట్ అనౌన్స్ చేసిన వివో..ఫీచర్స్ ఇవేనంట| Tech News
ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 59,730 రూపాయలుగా వుంది.
ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 54,750 రూపాయలుగా వుంది.
Also Read: Surprising News: ఇక ఈ ఫోన్ లలో WhatsApp పనిచెయ్యదు..ఎందుకంటే.!
ఇక దేశంలోని ప్రధాన నగరాలలో ఈరోజు నమోదైన గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు హైదరాబాద్, ముంభై మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. రూ. 59,730 రూపాయలుగా వుంది మరియు విజయవాడతో పాటు వైజాగ్ మార్కెట్ లో కూడా ఇదే రేటు నమోదయ్యింది.
దేశరాజధాని ఢిల్లీ లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 59,880 గా ఉండగా చెన్నై మార్కెట్ లో రూ. 60,050 రూపాయలుగా వుంది.
అంటే, ఈరోజు కూడా చెన్నై మార్కెట్ దేశంలోని అన్ని మార్కెట్ ల కంటే గరిష్ట రేటును నమోదు చేసింది.
గమనిక: ఆన్లైన్ బంగారం ధర మరియు లోకల్ మార్కెట్ లోని బంగారం ధర లలో మార్పులు ఉంటాయని గమనించాలి.