Gold Rate: జూన్ 19 గోల్డ్ రేట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.!
మార్కెట్ లో గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగుతోంది
జూన్ 16న పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్
గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా 60 వేల మార్క్ వద్దనే కొసాగుతోంది
Gold Rate: ఈరోజు (జూన్ 19) మార్కెట్ లో గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగుతోంది. జూన్ 16న పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఆ తరువాత నిశ్చలంగా ఉండి పోయింది. గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా 60 వేల మార్క్ వద్దనే కొసాగుతోంది మరియు గత వారంలో మూడు నెలల కనిష్ఠాన్ని చూసిన గోల్డ్ మార్కెట్ ఈ వారం ఎటు సాగుతోందో అనే సంధిగ్ధంలో పడేసింది.
Gold Rate: (జూన్ 19)
ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10గ్రాముల 24క్యారెట్ బంగారం ధర రూ. 60,070 వద్ద క్లోజింగ్ ను నమోదు చెయ్యగా, 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 55,070 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈరోజు కూడా బంగారం ధర కనిష్ఠ ధరలోనే కొనసాగుతోంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, నిజామాబాద్, గుంటూరు మరియు వైజాగ్ వంటి నగరాలలో ఇదే రేట్ కొనసాగుతోంది.
ఇక ఈ నెల ప్రారంభం నుండి గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, జూన్ 1వ తేదీ రూ. 61,100 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24K స్వచ్ఛమైన బంగారం ధర ఈరోజు రూ. 60,070 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, రూ. 56,000 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22K ఆర్నమెంట్ బంగారం ధర రూ. 55,070 రూపాయల వద్దకు చేరుకుంది. అంటే, గోల్డ్ రేట్ మెల్ల మెల్లగా క్రిందకు దిగడాన్ని మనం గమనించవచ్చు.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.