Gold: ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ పైన ఒక లుక్ వెయ్యండి.!

Updated on 15-Mar-2023
HIGHLIGHTS

గోల్డ్ మార్కెట్ ఈ రోజు నిలకడగా కొనసాగుతోంది

మూడు రోజుల్లోనే భారీ పెరుగుదలను చూసిన బంగారం సూచీలు

పసిడి ప్రియులు ఈరోజు కొంత ఊరట పొందారు

గత వారం చివరి నుండి భారీ పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఈ రోజు నిలకడగా కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే భారీ పెరుగుదలను చూసిన బంగారం సూచీలు, ఈరోజు స్టేబుల్ గా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరను చూస్తున్న పసిడి ప్రియులు ఈరోజు కొంత ఊరట పొందారు. ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ పైన ఒక లుక్ వెయ్యండి.  

Gold:

ఈరోజు ఉదయం రూ.53,150 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఈరోజు 100 రూపాయలు క్రిందకు దిగి  ప్రస్తుతం రూ.53,050 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.57,980 రూపాయల నుండి రూ.110 రూపాయలు పెరిగి రూ.57,870 వద్ద కొనసాగుతోంది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,870 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,870 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,020 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,690 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :