Gold Rate: గత మూడు రోజులుగా బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మే నెల ప్రారంభం నుండి ఈ నెల మార్కెట్ ను పరిశీలిస్తే, ఈ నెల ప్రారంభంలో ఎక్కడైతే గోల్ మార్కెట్ ప్రాంభమయ్యిందో, మల్లి వచ్చి అక్కడికే చేరినట్లు మనం చూడవచ్చు. ఈ నెల పసిడి ప్రియులకు కొంత నిరాశను మరియు నెల చివరికి కొంత ఊరటని అందించిందని చెప్పవచ్చు.
మే 1 న గోల్డ్ బంగారం ధర (10గ్రా) రూ. 60,760 రూపాయల వద్ద మొదలై ఈ నెలలో రూ. 62,400 రూపాయల గరిష్ట రేట్ ను నమోదు చేసిన మళ్ళి క్రిందకు దిగి ప్రస్తుతం ఈరోజు రూ. 60,550 రూపాయల వద్ద కొసాగుతోంది. అంటే, ఈ నెలలో భారీ మార్పులనే గోల్డ్ మార్కెట్ చూసింది మరియు చివరికి క్లోజింగ్ మాత్రం నష్టాల్లోనే ముగిసింది.
ఇక ఈరోజు పసిడి ధరల వివరాల్లోకి వెళితే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో 22K (10గ్రా) బంగారం ధర రూ. 60,550 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 24K (10గ్రా) బంగారం ధర రూ. 55,500 వద్ద కొనసాగుతోంది.
ఈరోజు హైదరాబాద్, వైజాగ్, వరంగల్, నిజామాబాద్, గుంటూరు, విజయవాడ వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరా లలో పైన సూచించిన గోల్డ్ రేట్ లు కొనసాగుతున్నాయి.
అయితే, చెన్నై, ఈరోడ్, తిరుచ్చి, తిరుపూర్ మరియు సేలం వంటి మార్కెట్ లు ఈరోజు గరిష్ట గోల్డ్ రేట్ ను నమోదు చేశాయి. ఈ రోజు ఈ మార్కెట్ లలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 60,960 గా ఉండగా, 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 55,880 రూపాయల వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఇక్కడ అందించిన ఆన్లైన్ ధరలు మరియు లోకల్ మార్కెట్ ధరలలో మార్పులు ఉండవచ్చు.