Gold Rate: ఎంత తగ్గిందో అంత పెరిగిన బంగారం ధర. నిన్నమార్కెట్ లో గోల్డ్ రేట్ ఎంత తగ్గిందో ఈరోజు అంతే ధర పెరిగింది. అంటే, నిన్న రెండు నెలల కనిష్ఠాన్ని చుసిన గోల్డ్ మార్కెట్ తిరిగి మళ్లి పెరిగింది. వాస్తవానికి, ఈ నెల ప్రారంభం నుండి గోల్డ్ రేట్ నెల చూపులనే చూస్తోంది. గత నెల భారీగా పెరిగిన తరువాత గోల్డ్ గోల్డ్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. మరి ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో చూద్దామా.
నిన్న మార్కెట్ లో రూ. 60,220 రూపాయల వద్ద కొనసాగిన ఒక తులం 24క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు 430 రూపాయల పెరుగుదలను చూసి ఈరోజు రూ. 60,650 వద్ద ముగిసింది. అలాగే, నిన్న రూ. 55,200 రూపాయల వద్ద కొనసాగిన ఒక తులం 22క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు 400 రూపాయల పెరిగి ఈరోజు రూ. 55,600 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, విజయనగరం, వరంగల్, నిజామాబాద్, వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో కూడా ఇదే రేటు వద్ద గోల్డ్ మార్కెట్ కొనసాగుతోంది.
ఇక నెల స్టార్టింగ్ నుండి గోల్డ్ మార్కెట్ వివరాలను పరిశీలిస్తే, గోల్డ్ ,మార్కెట్ నిన్న, అనగా జూన్ 8వ తేదీ గత రెండు నెలల కనిష్ఠాన్ని నమోదు చెయ్యగా, నెల ప్రారంభంలో జూన్ 1వ తేదీకి గరిష్ట రేటును నమోదు చేసింది. జూన్ 1 న ఓక్ తులం స్వచ్ఛమైన బంగారం రూ. 60,760 వద్ద ఉంటే, జూన్ 8న రూ. 60,220 కనిష్ఠ రేటును టచ్ చేసింది.