Gold Live: ఈరోజు భారీగా బంగారం ధర..లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!

Gold Live: ఈరోజు భారీగా బంగారం ధర..లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగింది

ఈరోజు బంగారం ధర రూ.660 రూపాయలు పెరిగింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ వివరాలను పరిశీలిద్దాం

Gold Live: ఈరోజు మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగింది. నిన్న స్వల్పంగా గోల్డ్ మార్కెట్ క్రిందకు దిగింది అని అనుకునేంత లోపలే  ఈరోజు బంగారం ధర భారీగా పెరుగుదలను నమోదు చేసింది. ఈరోజు తులానికి 660 రూపాయలకు పైగా పెరుగుదలను గోల్డ్ మార్కెట్ పెరుగుదలను నమోదు చేసింది. ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ వివరాలను పరిశీలిద్దాం. 

Gold Rate:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.54,700 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.600 రూపాయలు పెరిగి రూ.55,300 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.59,670 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.60,330 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు బంగారం ధర రూ.660 రూపాయలు పెరిగింది.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,330 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,330 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,480 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,480 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo