దిగిరాను అంటున్న గోల్డ్ రేట్..ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే.!
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర ఎత్తలేని బరువుగా మారుతోంది
మార్కెట్ లో గోల్డ్ రేట్ దాదాపుగా 61 వేల నుండి 62 వేల మార్క్ వద్దనే కొనసాగుతోంది
మార్కెట్ అప్డేట్స్ చూడలంటే భయమేసేలా గోల్డ్ మార్కెట్ కనిపిస్తోంది
మార్కెట్ లో గోల్డ్ రేట్ దాదాపుగా 61 వేల నుండి 62 వేల మార్క్ వద్దనే కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర ఎత్తలేని బరువుగా మారుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న పసిడి ప్రియులకు మార్కెట్ అప్డేట్స్ చూడలంటే భయమేసేలా గోల్డ్ మార్కెట్ కనిపిస్తోంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు ప్రధాన నగరాలలో గోల్డ్ రేట్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
గోల్డ్ మార్కెట్
ఈరోజు గోల్డ్ మార్కెట్ దాదాపుగా స్థిరంగానే వుంది మరియు రేటులో పెద్దగా మార్పేమీ లేదు. ఈరోజు రూ. 61,910 వద్ద స్టార్ట్ అయిన 24K (10గ్రా) పసిడి రూ. 61,910 ధర ముగిసింది. 22K ఆర్నమెంట్ బంగారం ధర కూడా రూ. 56,650 వద్ద ప్రారంభమై రూ. 56,750 వద్ద ముగిసింది. తులానికి కేవలం 110 రూపాయల మార్పును మాత్రమే గోల్డ్ మార్కెట్ చూసింది.
తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేట్
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల లలో గోల్డ్ మార్కెట్ అప్డేట్ లోకి వెళితే, ఈరోజు కూడా విజయవాడ మరియు హైదరాబాద్ లలో ఒకే ధర వద్ద గోల్డ్ మార్కెట్ కొనసాగుతోంది. ఈరోజు రెండు ప్రధాన నగరాల్లో 24K స్వచ్ఛమైన బంగారం ధర రూ. 61,910 గా ఉండగా, 22K ఆర్నమెంట్ బంగారం ధర రూ. 56,750 గా వుంది.
అయితే, దేశంలో అన్ని ప్రాంతాల కంటే చెన్నై మార్కెట్ లో గోల్డ్ రేట్ అధికంగా వుంది. ఈరోజు చెన్నై మార్కెట్ లో ఒక తులం 24K ప్యూర్ గోల్డ్ రేట్ రూ. 62,380 గా నమోదు కాగా, 22K గోల్డ్ రేట్ రూ. 57,180 గా నమోదయ్యింది.
Note: ఇక్కడ అందించిన గోల్డ్ రేట్స్ ఈరోజు లైవ్ మార్కెట్ (ఆన్లైన్) ధరలు. లోకల్ మార్కెట్ మరియు నళినే ధరలలో మార్పులు ఉండవచ్చు.