మిశ్రమ ధోరణిలో పసిడి.. ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!

మిశ్రమ ధోరణిలో పసిడి.. ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

పసిడి మార్కెట్ గత కొన్ని రోజులుగా మిశ్రమ ధోరణిలో పయనిస్తోంది

నిన్న క్రిందకు దిగిన పసిడి ధర

ఈరోజు Live అప్డేట్ తెలుసుకోండి

పసిడి మార్కెట్ గత కొన్ని రోజులుగా మిశ్రమ ధోరణిలో పయనిస్తోంది. గత వారం ప్రారంభంలో భారీ పెరుగుదలను నమోదు చేసిన పసిడి వారాంతానికి క్రిందకు దిగుతూ వచ్చింది. నిన్న కూడా క్రిందకు దిగిన పసిడి ధర, ఈరోజు మాత్రం మళ్ళీ పెరుగుదలను నమోదు చేసింది. అంటే, పసిడి మిశ్రమ ధోరణిలో పయనిస్తున్న విషయాన్ని మనం పరిశీలించవచ్చు. మరి ఈరోజు గోల్డ్ మర్కెట్ అప్డేట్ ఎలాగ కొనసాగుతోందో చూద్దామా. 

Gold Rate:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.55,400 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.300 రూపాయలు పెరిగి రూ.55,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.60,430 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.60,760 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు బంగారం ధర రూ.330 రూపాయలు పెరుగుదలను నమోదు చేసింది.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,760 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,760 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,910 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,420 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo