Gold Rate Live: మళ్ళీ 64 వేలకు చేరువలో బంగారం ధర.!
గత వారం మెల్లగా క్రిందకు దిగిన బంగారం ధర
బంగారం ధర మళ్ళీ 64 వేల చేరువలోకి వచ్చింది
10 రోజులుగా వరసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర
Gold Rate Live: గత వారం మెల్లగా క్రిందకు దిగిన బంగారం ధర, మళ్ళీ 64 వేలకు చేరువలోకి వచ్చింది. అంటే, బంగారం ధర ఈ నెల మరొకసారి 64 వేల రూపాయల మార్క్ వద్దకు చేరుకుంది. డిసెంబర్ నెల ప్రారంభంలో 64 వేల మార్క్ ను దాటిన గోల్డ్ మార్కెట్ ఇప్పుడు మళ్ళీ 64 వేల మార్క్ దరిదాపుల్లో చేరుకుంది. గడిచిన 10 రోజులుగా వరసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర పసిడి ప్రియులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరి ఈరోజు భారత మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం ధర వివరాలను నిశితంగా పరిశీలిద్దామా.
Gold Rate Live
ఈరోజు భారత ప్రధాన మార్కెట్ లో కొనసాగుతూన్న బంగారం దరను పరిశీలిస్తే, ఈరోజు గోల్డ్ రేట్ రూ. 63,710 రూపాయల వద్ద క్లోజింగ్ నమోదు చేసింది. నిన్న రూ. 63,490 వద్ద ముగిసిన గోల్డ్ రేట్ ఈరోజు కూడా రూ. 220 రూపాయల లాభాన్ని చూసింది.
Also Read : NoiseFit Voyage 4G eSIM స్మార్ట్ వాచ్ వచ్చేసింది..ధర ఎంతంటే.!
24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు ఉదయం రూ. 63,490 రూపాయల వద్ద ప్రారంభమైన 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేట్, సాయంత్రానికి రూ. 220 రూపాయలు పెరిగి రూ. 63,710 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది. గడిచిన 10 రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర దాదాపుగా రూ. 1,100 రూపాయలకు పైగా పెరిగింది.
22 క్యారెట్ గోల్డ్ రేట్
ఇక 24 క్యారెట్ గోల్డ్ రేట్ రేటు విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 58,200 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 200 పెరిగి రూ. 58,400 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. గడిచిన 10 రోజుల్లో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్ రేట్ దాదాపుగా రూ. 1,000 రూపాయల పెరుగుధలను నమోదు చేసింది.
ఓవరాల్ గా చూస్తే బంగారం ధర డిసెంబర్ నెలలో భారీ రేటును నమోదు చేస్తోంది. అంతేకాదు, ఈ నెలలో బంగారం ధర అప్ అండ్ డౌన్స్ ను కూడా బాగానే చూసింది.