Gold Rate Live: గడిచిన 10 రోజులుగా దిగజారిన గోల్డ్ మార్కెట్, మళ్ళి తిరిగి మెల్లగా పుంజుకుంటోంది. ఈరోజు కూడా బంగారం ధర తులానికి రూ. 270 రూపాయల పెరుగుధలను చూసింది. గడిచిన వారం కూడా గోల్డ్ మార్కెట్ రూ. 700 రూపాయలకు పైగా నష్టాలను చూసింది. అయితే, ఈ వారంలో మాత్రం గోల్ మార్కెట్ మెల్లగా పుంజుకుంటోంది మరియు 63 వేల రూపాయల మార్క్ ను చేసురుకునే దిశగా పయనిస్తోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ మరియు గోల్డ్ రేట్ లైవ్ అప్డేట్ ఎలా కొనసాగుతోందో ఒక లుక్కేద్దామా.
నిన్న మరియు ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరుగుధలను చూసింది. పెద్ద మొత్తంలో కాకపోయినా గోల్డ్ రేట్ లో కదలికలును మార్కెట్ లో నమోదు చేసింది. ఇప్పటికే గోల్డ్ మార్కెట్ నష్టాలతో షేర్ హోల్డర్స్ కొంత నిరాశకు గురవుతున్న సమయంలో గోల్డ్ రేట్ పెరగడం కొంత ఊరటనిస్తుంది.
కానీ, గోల్డ్ కొనాలని చుస్తున్న పసిడి ప్రియులకు మాత్రం ఇది చేదు వార్తే అవుతుంది. కానీ, జనవరి నెలతో పోలిస్తే మాత్రం ఈ ఈనెలలో గోల్డ్ మార్కెట్ కనిష్ట ధరలోనే నడుస్తోంది. అయితే, గోల్డ్ మార్కెట్ మరింత పెరిగి అవకాశం ఉందని చెబుతున్న నిపుణుల మాటలు ఆలోచనలో పడేశాయి.
Also Read : Xiaomi 14 Ultra: షియోమి అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర మరియు ఫీచర్స్ పైన లుక్కేయండి.!
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 62,680 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు రూ. 57,460 రూపాయల వద్ద ఒక తులం 22 క్యారెట్ గోల్డ్ రేట్ కొనసాగుతోంది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.