Gold Rate Live: మార్కెట్ లో 63 వేల మార్క్ టచ్ చేసిన గోల్డ్ రేట్.!
ఈరోజు మార్కెట్ లో బంగారం ధర 63 వేల రూపాయల మార్క్ ను టచ్ చేసింది
స్థిరంగా కొనసాగిన గోల్డ్ రేట్ మళ్ళీ మెల్లగా పెరగడం మొదలు పెట్టింది
డిసెంబర్ నెలలో గోల్డ్ మార్కెట్ నాటకీయ పరిణామాలను చూస్తోంది
Gold Rate Live: ఈరోజు మార్కెట్ లో బంగారం ధర 63 వేల రూపాయల మార్క్ ను టచ్ చేసింది. గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగిన గోల్డ్ రేట్ మళ్ళీ మెల్లగా పెరగడం మొదలు పెట్టింది. సోమవారం (డిసెంబర్ 18న) నాడు స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్ ఈరోజు కూడా స్వల్పంగా పెరిగి మెల్లగా 63 వేల మార్క్ ను చేరుకుంది. ముందు నుండే చెబుతున్నట్లుగా, డిసెంబర్ నెలలో గోల్డ్ మార్కెట్ నాటకీయ పరిణామాలను చూస్తోంది. గోల్డ్ పైన ఇన్వెస్ట్ ఛీ వారికి ఒక వారం లాభాలను పంటను అందిస్తే మరొక వారం చుక్కలు చూపిస్తోంది.
Gold Rate Live
ఈరోజు గోల్డ్ రేట్ లైవ్ వివరాల్లోకి వెళితే ఈరోజు గోల్డ్ రేట్ తులానికి రూ. 380 రూప్యాలు పెరిగింది మరియు రూ. 63,00 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
అయితే, గడిచిన 10 రోజుల్లో మాత్రం బంగారం ధర పెరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, డిసెంబర్ 11 వ తేదీ 62,130 రూపాయల నుండి పైకి ఎగబాకి రూ. 63,000 కి చేరుకుంది. అంటే, ఈ 10 రోజుల్లో బంగారం ధర ఓవరాల్ గా రూ. 870 రూపాయలు పెరిగింది.
Also Read : Poco M6 5G Launch: చవక ధరలో కొత్త 5జి ఫోన్ లాంచ్ చేస్తున్న పోకో.!
24 క్యారెట్ బంగారం ధర
ఈరోజు 24 క్యారెట్ బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 63,000 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
22 క్యారెట్ బంగారం ధర
ఇక 24 క్యారెట్ బంగారం ధర బంగార ధర వివరాలికి వెళితే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 57,400 రూపాయల వద్ద మొదలై రూ. 350 రూప్యాలు క్రిందకు దిగి రూ. 57,750 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది.
అయితే, మార్కెట్ లో గోల్డ్ రేట్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, ప్రసుతం మార్కెట్ లో కొనసాగుతున్న మిశ్రమ ధోరణి చూస్తుంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితి కనబడుతోంది.
Note: ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో వ్యత్యాసాలు ఉంటాయని గమనించాలి.