Gold Rate Live: భారీగా పెరిగిన బంగారం ధర..New Price ఎంతంటే.!
దేశంలో ఈరోజు బంగారం ధర భారీగా పెరిగిపోయింది
Gold Rate Live లాభాలను నమోదు చేసినట్లు మనం గమనించవచ్చు
గోల్డ్ మార్కెట్ ఇప్పుడు పుంజుకొని గరిష్టం ధర వైపుగా దూసుకుపోతోంది
దేశంలో ఈరోజు బంగారం ధర భారీగా పెరిగిపోయింది. Gold Rate Live వివరాలను పరిశీలిస్తే గడిచిన మూడు రోజుల్లో గోల్డ్ మార్కెట్ భారీగా లాభాలను నమోదు చేసినట్లు మనం గమనించవచ్చు. వాస్తవానికి, పండుగ సీజన్ లో గోల్ మార్కెట్ ఊపందుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేయగా, అది ఇప్పుడు మొదలైనట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ వారంలో ఈ నెల కనిష్ఠాన్ని నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఇప్పుడు పుంజుకొని గరిష్టం ధర వైపుగా దూసుకుపోతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు New Price వివరాలను పరిశీలిద్దామా.
Todays Gold Rate Live:
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో ఒక తులం బంగారం ధర ఉదయం రూ. 61,040 రూపాయల వద్ద మొదలై రూ. 61,690 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అంటే, ఈరోజు గోల్డ్ మార్కెట్ తులానికి రూ. 650 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది.
Also Read : Facebook మరియు Instagram కోసం AI ఆధారిత వీడియో ఎడిటింగ్ ఫీచర్ తెచ్చిన Meta.!
ఈరోజు 24 Carat గోల్డ్ రేట్
ఈరోజు 24 Carat గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, రూ. రూ. 61,040 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 650 రూపాయల లాభాన్ని చూసి, రూ. 61,690 వద్ద క్లోజింగ్ నమోదు చేసింది.
ఈరోజు 22 Carat గోల్డ్ రేట్
ఇక ఈరోజు 22 Carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు రూ. 55,950 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 600 రూపాయలు పైకి ఎగబాకి, రూ. 56,550 వద్ద క్లోజింగ్ నమోదు చేసింది.
ఈ వారం గోల్డ్ మార్కెట్ అప్డేట్
ఇక ఈ వారం గోల్డ్ మార్కెట్ అప్డేట్ ను పరిశీలిస్తే, ఈ సోమవారం గోల్డ్ మార్కెట్ రూ. 60,490 రూపాయల వద్ద ప్రారంభమయ్యింది. వారం ప్రారంభం నుండే లాభాలను చూసిన మార్కెట్ 5 రోజుల్లో రూ. 1,200 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసి రూ. 61,690 వద్ద స్థిరపడింది.
గమనిక : గమనిక ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి