Gold Rate: మెల్లగా పెరుగుతున్న బంగారం ధర..!

Gold Rate: మెల్లగా పెరుగుతున్న బంగారం ధర..!
HIGHLIGHTS

బంగారం ధర నిన్నటి నుండి మెల్లగా పెరుగుతోంది

బంగారం ధర ఇప్పటికీ అందని ద్రాక్ష మాదిరిగానే కనిపిస్తోంది

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ ధర ఎలా కొనసాగుతోందో చూద్దామా

Gold Rate: గత రెండు వారాలుగా క్రిందకు దిగుతూ వస్తున్న బంగారం ధర నిన్నటి నుండి మెల్లగా పెరుగుతోంది. గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం మెల్లమెల్లగా పెరుగుతున్నా ఇప్పటికీ వారం రోజుల కనిష్టంలోనే కొనసాగుతోంది. కానీ, బంగారం కొనాలని చూస్తున్న పసిడి ప్రియులకు మాత్రం బంగారం ధర ఇప్పటికీ అందని ద్రాక్ష మాదిరిగానే కనిపిస్తోంది. ఈరోజు మార్కెట్ లో గోల్డ్ ధర ఎలా కొనసాగుతోందో చూద్దామా.    

Gold Rate:

ఈరోజు ఉదయం రూ.51,450 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి రూ.51,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,120 నుండి క్రిందకు దిగి రూ.56,290 రూపాయల వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,440 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo