వారంలో రూ.1,200 పైగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటే.!
పండుగ సీజన్ గోల్డ్ మార్కెట్లో కూడా కనిపిస్తోంది
గత వారం వరకూ నెమ్మదించిన గోల్డ్ మార్కెట్ మెల్లమెల్లగా పెరుగుతోంది
గత వారం ప్రారంభంతో పోలిస్తే బంగారం ధర తులానికి 1200 రూపాయలకు పైగా పెరిగింది
పండుగ సీజన్ గోల్డ్ మార్కెట్లో కూడా కనిపిస్తోంది. గత వారం వరకూ నెమ్మదించిన గోల్డ్ మార్కెట్ మెల్లమెల్లగా పెరుగుతోంది. గత వారం ప్రారంభంతో పోలిస్తే బంగారం ధర తులానికి 1200 రూపాయలకు పైగా పెరిగింది. ఈరోజు కూడా మార్కెట్లో బంగారం ధర తులానికి 300 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. వాస్తవానికి, సెప్టెంబర్ నెల మొత్తం కూడా గోల్డ్ ధర దాదాపుగా ఈ సంవత్సర కనిష్టంలోనే కొనసాగింది. కానీ, అక్టోబర్ ప్రారంభమవుతూనే రోజు రోజుకి మార్కెట్ పుంజుకుంది. ఈరోజు మార్కెట్లో గోల్డ్ ధర ఎలా కొనసాగుతుందో పరిశీలిద్దాం.
నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,500 రూపాయలుగా ఉండగా, ఈరోజు 350 రూపాయలు పెరిగి 46,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,110 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఈరోజు బంగారం ధర
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,870 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,120 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,110 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330 గా ఉంది.