Gold: గోల్డ్ రేట్ ఈరోజు కూడా పెరిగింది.. ఈరోజు క్లోజింగ్ రేటు ఎంతంటే.!

Gold: గోల్డ్ రేట్ ఈరోజు కూడా పెరిగింది.. ఈరోజు క్లోజింగ్ రేటు ఎంతంటే.!
HIGHLIGHTS

Gold: గత పది రోజులుగా ఒకే పంథాలో సాగుతున్న గోల్డ్ రేట్

గోల్డ్ రేట్ ఈరోజు కూడా పెరిగింది

Gold rate ఈరోజు 60 వేల మార్క్ వద్దకు చేరుకుంది

Gold: గత పది రోజులుగా ఒకే పంథాలో సాగుతున్న గోల్డ్ రేట్, ఈరోజు కూడా పెరిగింది. ఆగష్టు 17న గత మూడు నెలల కనిష్ఠాన్ని నమోదు చేసిన గోల్డ్ రేట్ వరుసగా మూడు అదే దారిలో కొనసాగి ఆ తరువాత ఆగష్టు 21వ తేదీ నుండి పెరగడం మొదలు పెట్టింది. అయితే, గోల్డ్ రేట్ ఒక్కసారిగా భారీ పెరుగుదలను నమోదు చెయ్యలేదు. కానీ, రోజు రోజుకు మెల్ల మెల్లగా పెరుగుతూ ఈరోజు 60 వేల మార్క్ వద్దకు చేరుకుంది. గత 10 రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు ఈరోజు గోల్డ్ రేట్ వివరాలను చూద్దాం పదండి. 

Gold Rate: 

ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 59,400 రుపాయల వద్ద మొదలై రూ. 270 రూపాయలు పెరిగి రూ. 59,670 రూపాయల వద్ద ఈరోజు మార్కెట్ క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 54,450 రుపాయల వద్ద ప్రారంభమై రూ. 250 రూపాయలు పైకి చేరుకొని రూ. 54,700 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ రేటును నమోదు చేసింది. 

అయితే, చెన్నై మార్కెట్ లో మాత్రం ఈరోజు 24K స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 60,220 రూపాయల హై రేటును నమోదు చేసింది మరియు దేశంలో ఈరోజు గరిష్ట ధర ఇదే అవుతుంది.

గోల్డ్ రేటు పెరుగుతున్న ఇది భారీ మొత్తంగా పెరగడం లేదు కాబట్టి తక్కువ మొత్తంలో గోల్డ్ కొనే వారికి ఇది స్థిరమైన మార్కెట్ గానే సూచిస్తున్నారు. అయితే, గోల్డ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారికి మరియు ఎక్కువ మొత్తంలో గోల్డ్ ను కొనే వారికి గత 10 రోజుల గోల్డ్ రేట్ పెరుగుదల లాభాలను చూపించింది.                     

అయితే, రానున్న నెలల్లో భారతీయలకు పండుగ నెలలు కావడం, ఎక్కువ శాతం ప్రజలు గోల్డ్ కొనుగోలుకు మక్కువ చూపుతారు కాబట్టి గోల్డ్ రేట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo