Gold Rate:మార్కెట్ లో దూసుకెళుతున్న పసిడి.. ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!

Updated on 01-Jun-2023
HIGHLIGHTS

Gold Rate: మార్కెట్ లో దూసుకెళుతున్న పసిడి

ఈరోజు కూడా మార్కెట్ లో గోల్డ్ రేట్ మరింతా పెరిగింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ మూడు నెలల గరిష్ఠాన్ని నమోదు చేసింది

Gold Rate: మార్కెట్ లో దూసుకెళుతున్న పసిడి, ఈరోజు కూడా మార్కెట్ లో గోల్డ్ రేట్ మరింతా పెరిగింది. ఈ వారం మొత్తం కూడా మార్కెట్ లో బంగారం ధర పెరుగుతూనే వుంది మరియు ఈరోజు గోల్డ్ మార్కెట్ మూడు నెలల గరిష్ఠాన్ని నమోదు చేసి పసిడి ప్రియులను నిరాశపరిచింది. నిన్న తులానికి 480 రూపాయలకు పైగా పెరిగిన గోల్డ్ రేట్, ఈరోజు కూడా 400 కు పైగా పెరుగుదలకు నమోదు చేసింది. ఇక ఈ వారం గోల్డ్ మార్కెట్ ట్రెండ్ ను పరిశీలిస్తే, ఈ ఒక్క వారంలోనే తులానికి 1,500 లకు  పైగా గోల్డ్ రేట్ పెరిగింది. ఇక ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో తెలుసుకుందాం.           

Gold Rate:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంa ధర 47,800 రూపాయలుగా ఉండగా, ఈరోజు 400 రూపాయల పెరుగుదలను నమోదు చేసి, రూ.48,200 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.52,580 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,580 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,580 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.52,750 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,920 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,370 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :