Gold: ఆగనంటున్న బంగారం ధర..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!

Gold: ఆగనంటున్న బంగారం ధర..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

నిన్న కొంత శాంతించిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మళ్ళీ తిరిగి పుంజుకుంది.

ఈరోజు కూడా బంగారం ధర భారీ పెరుగుదలను నమోదు చేసింది

బంగారం ధర తులానికి రూ.3,000 రూపాయలకు పైగా పెరిగింది

నిన్న కొంత శాంతించిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మళ్ళీ తిరిగి పుంజుకుంది. ఈరోజు కూడా బంగారం ధర భారీ పెరుగుదలను నమోదు చేసింది. మార్చి 10వ తేదీ నుండి మొదలైన బంగారం పెరుగుదల ఈరోజు వరకూ నాన్ స్టాప్ గా సాగుతూనే వుంది. మొత్తంగా కేవలం ఒక్క వారంలోనే బంగారం ధర తులానికి రూ.3,000 రూపాయలకు పైగా పెరిగింది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర అప్డేట్ ఎలా ఉన్నదో చూద్దాం పదండి. 

Gold:

ఈరోజు ఉదయం రూ.53,050 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఈరోజు 500 రూపాయలు పైకి ఎగబాకి   ప్రస్తుతం రూ.53,550 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.57,870 రూపాయల నుండి రూ.550 రూపాయలు పెరిగి రూ.58,420 వద్ద కొనసాగుతోంది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,420 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,420 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,570 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,180 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo