Gold Rate: పెరుగుతున్న బంగారం ధర..New Price ఎంతంటే.!
Gold Rate: మొన్నటి వరకూ మార్కెట్ లో పడిపోతూ వచ్చిన బంగారం ధర
బంగారం ధర మెల్ల మెల్లగా తన ఉనికిని చాటుకుంటోంది
ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర పెరిగింది
Gold Rate: మొన్నటి వరకూ మార్కెట్ లో పడిపోతూ వచ్చిన బంగారం ధర మెల్ల మెల్లగా తన ఉనికిని చాటుకుంటోంది. అక్టోబర్ 5 వ తేదీన 8 నెలల కనిష్ఠాన్ని చుసిన గోల్ మార్కెట్, అక్టోబర్ 6 వ తేదీ నుండి నెమ్మదిగా పైకి చేరుకోవడం మొదలుపెట్టింది. ఆనాటి నుండి నేటి వరకూ కూడా బంగారం ధర సూచీలు పైకి వెళుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర పెరిగింది మరియు ప్రస్తుతం 58 వేల రూపాయల మార్క్ పైన కొనసాగుతోంది.
Gold Rate Today
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం ధర మరియు లేటెస్ట్ మార్కెట్ అప్డేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు మార్కెట్ లో బంగారం ధర రూ. 220 రూపాయలకు పైగా పెరుగుధలను చూసింది.
Also Read : ఈ బ్రాండెడ్ Ear Buds పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన Amazon | Great deals
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు మార్కెట్ లోని 24 Carat గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, ఉదయం మార్కెట్ లో రూ. 57,980 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 Carat గోల్డ్ రేట్ సాయంత్రానికి రూ. 220 రూపాయలు పెరిగి, రూ. 58,200 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది. హైద్రాబాద్, విజయవాడ,కలకత్తా, బెంగుళూరు మరియు నాగపూర్ వంటి మరిన్ని ప్రధాన నగరాలలో ఇదే రేటును గోల్ మార్కెట్ నమోదు చేసింది.
Also Read : Amazon GIF 2023 Sale నుండి Sony Smart Tv పైన జబర్దస్త్ ఆఫర్.!
22 Carat గోల్డ్ రేట్
మిక్స్ ఆర్నమెంట్ బంగారం విషయాన్ని వస్తే, ఈరోజు రూ. 53,150 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 Carat ఆర్నమెంట్ బంగారం ధర సాయంత్రానికి రూ. 200 రూపాయలు పెరిగి, రూ. 53,350 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.