మెల్లగా పుంజుకుంటున్న గోల్డ్ రేట్..ఈరోజు రేటు ఎంతంటే..!

Updated on 26-Apr-2023
HIGHLIGHTS

ఇటీవల క్రిందకు దిగిన గోల్డ్ మార్కెట్ మెల్లగా పుంజుకుంటోంది

నిన్న స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్

ఈరోజు కూడా అదే ట్రెండ్ ను ఫాలో అయ్యింది

ఇటీవల క్రిందకు దిగిన గోల్డ్ మార్కెట్ మెల్లగా పుంజుకుంటోంది. నిన్న స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా అదే ట్రెండ్ ను ఫాలో అయ్యింది. అయితే, వాస్తవానికి ఈ పది రోజుల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే గోల్డ్ రేట్ దాదాపు ఒకేవద్ద కొనసాగుతోంది. అయితే, మధ్యలో మాత్రం హెచ్చు తగ్గులను నమోదు చేసింది. ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ మరియు మార్కెట్ అప్డేట్ పైన  ఒక లుక్కేద్దామా. 

ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్

ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 55,850 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22K గోల్డ్ రేట్, 100 రూపాయలు పెరిగి రూ. 55,950 వద్ద ముగిసింది. అలాగే, 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ. 61,040 రూపాయల వద్ద ముగిసింది. 

10 రోజుల గోల్డ్ మర్కెట్

ఇక 10 రోజుల గోల్డ్ మార్కెట్ మరియు రేట్స్ వివరాల్లోకి వెళితే ఈ నెల 16 న రూ. 55,940 రూపాయలగా ఉండగా ఈరోజు రూ. 55,940 రూపాయల వద్ద ముగిసింది. అంటే, ఈ పది రోజుల్లో గోల్డ్ రేట్ దాదాపుగా స్థిరంగానే వుంది. అలాగే, స్వచ్ఛమైన 24K గోల్డ్ రేట్ ఏప్రిల్ 16 న రూ. 61,030 రూపాయలుగా ఉండగా, ఈరోజు రూ. 61,040 వద్ద ముగిసింది. అయితే, ఈ పదిరోజుల్లో గోల్డ్ రేట్ ఈ మధ్యలో 61,150 రూపాయల రెరేటును కూడా నమోదు చేసింది. 

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్ ఎలా ఉందని చూస్తే, ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ లలో గోల్డ్ రేట్ ఒకేవిధంగా కొనసాగుతోంది. ఈ రెండు ప్రధాన నగరాలలో 10గ్రాముల 22K గోల్డ్ రేట్ 55,950 రూపాయలుగా ఉండగా, 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ 61,040 వద్ద కొనసాగుతోంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :