వారం మొత్తం తగ్గు ముఖం పట్టిన గోల్డ్ మార్కెట్ ఒక్కరోజే లోనే భారీగా పెరిగింది. ఈ వారం మొత్తంగా మీద దాదాపుగా వెయ్యి రూపాయల వరకూ క్రిందకు దిగిన గోల్డ్ మార్కెట్, ఈరోజు మాత్రం భారీ గా పెరుగుదలను నమోదు చేసింది. మొత్తంగా చూస్తే ఈవారంలో ఈరోజు గోల్డ్ రేట్ మళ్ళీ 61 వేల మార్క్ ను దాటినట్లు చూడవచ్చు. ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ మరియు పసిడి మర్కెట్ వివరాలను పరిశీలిద్దామా.
ఈరోజు ఉదయం రూ. 60,870 వద్ద ప్రారంభమైన 10గ్రాముల పసిడి ధర రూ. 550 రూపాయలు పెరిగి రూ. 61,420 వద్ద ముగిసింది. 10 గ్రాముల 22K పసిడి ధర కూడా రూ. 500 క్రిందకు దిగి రూ. 55,800 నుండి రూ. 56,300 వద్ద ముగిసింది. అంటే, ఈరోజు గోల్డ్ మార్కెట్ లాభాలను చూసింది మరియు గత నాలుగు రోజుల ట్రెండ్ ను బ్రేక్ చేసింది.
ఇక ఈరోజు దేశ ప్రధాన మరియు తెలుగు రాష్టాల లలో పసిడి మార్కెట్ మరియు రేట్స్ ఎలా ఉన్నాయని పరిశీలిస్తే, ఈరోజు తెలుగు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో ఈరోజు టక తులం 24K ప్యూర్ గోల్డ్ రూ. 61,420 గా ఉండగా, 22K ఆర్నమెంట్ పసిడి ధర రూ. 56,300 గా ఉంది.
ఈరోజు ఢిల్లీ, జైపూర్ మరియు లక్నో లలో 24K గోల్డ్ రేట్(10గ్రా) రూ. 61,570 వద్ద కొనసాగుతోంది మరియు 22K గోల్డ్ రేట్ (10గ్రా) రూ. 56,450 వద్ద కొనసాగుతోంది.
అలాగే, ఈరోజు చెన్నై, కోయంబత్తూర్ మరియు మదురై లలో 24K గోల్డ్ రేట్ (10గ్రా) రూ. 61,960 మరియు 22K గోల్డ్ రేట్ (10గ్రా) రూ. 56,800 వద్ద కొనసాగుతోంది.