Gold Price Live: మారిన గోల్డ్ మార్కెట్ ట్రెండ్..అప్డేట్ తెలుసుకోండి.!
గోల్డ్ మార్కెట్ ఈ నెల ప్రారంభం నుండి ట్రెండ్ మార్చింది
గోల్డ్ మార్కెట్ పెరుగుదలను నమోదు చెయ్యడం మొదలుపెట్టింది
మళ్ళి బంగారం పెరుగుదల పసిడి ప్రియులకు చేదు వార్తే అవుతుంది
గత నెలలో రోజు రోజుకు పడిపోతూ వచ్చిన గోల్డ్ మార్కెట్ ఈ నెల ప్రారంభం నుండి ట్రెండ్ మార్చింది. గత్ రెండు రోజులు నుండి గోల్డ్ మార్కెట్ మెల్ల మెల్లగా పెరుగుదలను నమోదు చెయ్యడం మొదలుపెట్టింది. అయితే, ఒక్కసారిగా భారీ పెరుగుదలను నమోదు చెయ్యడం లేదు స్లో గా పైకి ఎగబాకుతోంది. ఇప్పటికికే బంగారం ధర గత మూడు నెలల గరిష్టంలో కొనసాగుతుండగా, మళ్ళి బంగారం పెరుగుదల పసిడి ప్రియులకు చేదు వార్తే అవుతుంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకుందామా.
Gold Price Live:
ఈరోజు ఉదయం రూ.51,600 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి రూ.51,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,290 నుండి పైకి ఎగబాకి రూ.56,450 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఈరోజు బంగారం ధర
తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,600 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,430 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.