Gold: ఈరోజు తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేట్ తెలుసుకోండి..!

Gold: ఈరోజు తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేట్ తెలుసుకోండి..!
HIGHLIGHTS

10 రోజులుగా పడిపోతూ వచ్చిన గోల్డ్ రేట్

ఈరోజు కొంచెం పుంజుకున్న బంగారం ధర

బంగారం ధర సూచీలు ఈరోజు పైకి చూశాయి

10 రోజులుగా పడిపోతూ వచ్చిన గోల్డ్ రేట్, ఈరోజు కొంచెం పుంజుకుంది. నిన్న కూడా మార్కెట్లో తులానికి 600 రూపాయల వరకూ తగ్గిన గోల్డ్ రేట్ ఈరోజు స్వల్పంగా పెరిగింది. అంటే, నిన్నటి వరకూ క్రిందకు దిగజారిన బంగారం ధర సూచీలు ఈరోజు పైకి చూశాయి. అందుకే, దేశంలోని ప్రధాన నగరాలతో సహా మన తెలుగు రాష్టాల్లో ఈరోజు బంగారం ధర ఎలా ఉన్నదో తెలుసుకోండి.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,010 రూపాయలుగా ఉండగా, ఈరోజు 240 రూపాయలు పెరిగి 47,250 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 310 రూపాయలు పెరిగి రూ.51,540 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,540 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,240 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,530 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,540 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,040 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,410 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo