Gold: దేశీయ మార్కెట్ లో ఈరోజు మళ్ళీ రికార్డ్ స్థాయికి చేరిన బంగారం ధర. గత శనివారం క్రిందకు దిగిన బంగారం ధర వారం మెల్లగా పెరిగి ఈరోజు 62 వేల మార్క్ ను దాటింది. గత శుక్రవారం (మే 5) రోజు గోల్డ్ రేట్ 62 వేల మార్కును దాటి రికార్డ్ స్థాయి రేటును నమోదు చేసింది. మరి దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ అప్డేట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా.
ఈరోజు మార్కెట్ లో 24K స్వచ్ఛమైన గోల్డ్ తులానికి 280 రూపాయలు పెరిగింది. ఉదయం రూ. 61,850 వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్ రూ. 62,130 వద్ద ముగిసింది. 22K ఆర్నమెంట్ గోల్డ్ రూ. 56,700 వద్ద ప్రారంభమై రూ. 56,950 రూపాయల వద్ద ముగిసింది. టోటల్ గా ఈరోజు గోల్డ్ మార్కెట్ లాభాల్లో ముగిసింది.
మే 8 (సోమవారం) రూ. 61,630 వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్ ఈరోజు రూ. 62 130 వద్ద కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో గోల్డ్ రేట్ తులానికి 500 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసి ఈరోజు రికార్డ్ స్థాయికి చేరుకుంది.
ఈరోజు హైదరాబాద్ లో 24K 10గ్రా గోల్డ్ రేట్ రూ. 62,130 గా ఉండగా 22K 10గ్రా గోల్డ్ రేట్ రూ. 56,950 గా వుంది. విజయవాడలో10గ్రా 24K బంగారం ధర రూ. 62,130 గా ఉండగా 10గ్రా 22K ధర రూ. 56,950 గా వుంది. ఎప్పటి మాదిరిగానే చెన్నై మార్కెట్ లో గోల్డ్ మరింత ప్రియంగా నిలిచింది.
ఈరోజు చెన్నై మార్కెట్ లో ఒక తులం 24K గోల్డ్ రూ. 62,650 వద్ద కొనసాగుతుండగా, 22K 10గ్రా గోల్డ్ రేట్ రూ. 57,420 గా వుంది.