ఈరోజు మార్కెట్ లో బంగారం ధర దారుణంగా పెరిగింది మరియు ఒక్కసారిగా 61 వేల మార్క్ ను Gold Rate దాటేసింది. ఈ వార్త గోల్డ్ కొనాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్ మరియు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన మదుపర్లకు గొప్ప శుభవార్త అవుతుంది. ఇప్పటికే, గడిచిన వారం రోజుల్లో గోల్డ్ రేట్ లో భారీ మార్పులు సంభవించగా, ఈ ఒక్కరోజు పెరిగిన ధరతో గోల్డ్ రేట్ అమాంతం చుక్కల్లోకి చేరుకుంది.
ఈరోజు మార్కెట్ లో బంగారం ధర 61 వేల మార్క్ ను దాటేసింది మరియు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం రూ. 60,760 రూపాయల మొదలైన గోల్డ్ రేట్ తులానికి రూ. 770 రూపాయల భారీ పెరుగుదలను చూసి రూ. 61,530 రూపాయల వద్దకు చేరుకుంది.
Also Read : Amazon GIF Sale నుండి రేపటితో ముగియనున్న SBI bank offer.!
ఈరోజు ఇరు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న 24 carat బంగారం ధరను పరిశీలిస్తే, ఈరోజు 10 గ్రా|| 24 క్యారెట్ బంగారం ధర రూ. 60,760 రూపాయల వద్ద ప్రారంభమై రూ. 770 పెరిగి రూ. 61,530 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది.
అలాగే, 24 క్యారెట్ బంగారం ధర వివరాల్లోకి వెళితే, ఉదయం రూ. 55,700 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రా|| 22 క్యారెట్ బంగారం ధర రూ. 700 రూపాయల పెరిగుదలను చూసి రూ. 56,400 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక ఈ వారం రోజుల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, గడిచిన 6 రోజుల్లో బంగారం మార్కెట్ భారీగా లాభాల్లో దూసుకుపోతోంది. కేవలం 6 రోజుల్లోనే బంగారం ధర దాదాపుగా 1500 రూపాయలకు పైగా పెరిగింది. క్రితం అక్టోబర్ 15వ తేదీన రూ. 60,110 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేట్ ఈరోజు రూ. 61,530 నడుస్తోంది. అంటే, గోల్డ్ రేట్ ఎంత దారుణంగా పెరుగుతోందో మనం అర్ధం చేసుకోవచ్చు.
గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.