ఈరోజు పెరిగిన బంగారం ధర..అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.!
ఈరోజు మార్కెట్ లో గోల్డ్ ధర స్వల్పంగా పెరిగింది
గత మూడు రోజులుగా నెల రోజుల కనిష్టం వద్ద నిచ్చిన గోల్డ్ రేట్
శనివారం భారీగా తగ్గిన గోల్డ్ ధర, ఈరోజు మళ్ళీ తిరిగి పైకి లేచింది
ఈరోజు మార్కెట్ లో గోల్డ్ ధర స్వల్పంగా పెరిగింది. గత మూడు రోజులుగా నెల రోజుల కనిష్టం వద్ద నిచ్చిన గోల్డ్ రేట్, ఈరోజు మాత్రం స్వల్పంగా పెరిగింది. గత వారాంతంలో శనివారం భారీగా తగ్గిన గోల్డ్ ధర, ఈరోజు మళ్ళీ తిరిగి పైకి లేచింది. అయితే, భారీ పెరుగుదలను నమోదు కాలేదని గుర్తుంచుకోండి. మరి మార్కెట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.
గోల్డ్ రేట్ అప్డేట్
ఈరోజు రూ. 60,330 వద్ద ప్రారంభమైన 10గ్రాముల 24క్యారెట్ బంగారం ధర 320 రూపాయల పెరుగు'ధాలను చూసి రూ. 60,650 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, 22క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22క్యారెట్ బంగారం ధర రూ. 55,600 రూపాయల క్లోజింగ్ ధరను నమోదు చేసింది.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్ లలో ఒక తులం 24K క్యారెట్ గోల్డ్ రూ. 60,650 వద్ద కొనసాగుతుండగా, ఒక తులం 22K క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 55,600 వద్ద కొనసాగుతోంది.
ఓవరాల్ గా గత రెండు రోజులుగా కనిష్టంగా ఉన్న పసిడి ధర, మెల్లగా పైకి ఎగబాకే దారిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, మార్కెట్ నిపుణులు మాత్రం గత రెండు రోజుల డాలర్ పతనం గోల్డ్ మార్కెట్ పైన ఎక్కువ ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. అయితే, గోల్డ్ రేట్ మాత్రం 63 వేల మార్క్ ను చేరుకునే అవకాశం ఉందని కూడా సూచిస్తున్నారు.