Gold Price Live: నెల చివరి రోజున పెరిగిన గోల్డ్ రేట్..!
గత రెండు వారాలుగా క్రిందకు దిగుతూ వచ్చిన పసిడి
ఈరోజు మాత్రం లాభాలను నమోదు చేసి 61 వేల మార్క్ వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది
నిన్న మే నెలల కనిష్ఠాన్ని నమోదు చేసిన గోల్డ్ రేట్
Gold Price Live: నెల చివరి రోజున పెరిగిన గోల్డ్ రేట్. గత రెండు వారాలుగా క్రిందకు దిగుతూ వచ్చిన పసిడి ధర మే నెల చివరి రోజైన ఈరోజు మాత్రం లాభాలను నమోదు చేసి 61 వేల మార్క్ వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. నిన్న కూడా గోల్డ్ స్థిరంగా గానే స్థిరంగానే కొసాగింది. అయితే, ఈరోజు మాత్రం తులానికి 440 రుపాయాలకు పైగా పెరుగుదలను చూసింది. నిన్న మే నెలల కనిష్ఠాన్ని నమోదు చేసిన గోల్డ్ రేట్, ఈరోజు మాత్రం నిలదొక్కుకొని నెల చివరి క్లోజింగ్ ను లాభాల్లో ముగించింది.
Gold Price Live:
ఈరోజు రూ. 60,490 వద్ద మొదలైన 24K (10గ్రా) గోల్డ్ రేట్ రూ. 440 రూపాయలు పెరిగి రూ. 60,930 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, రూ. 55,450 వద్ద మొదలైన 22K (10గ్రా) బంగారం ధర రూ. 400 రూపాయలు పైకి ఎగబాకి రూ. 55,850 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు మరియు వైజాగ్ వంటి ప్రధాన నగరాలలో ఈరోజు గోల్డ్ రేట్ పైన తెలిపిన ధరలను నమోదు చేసింది. అంటే, ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో 22K రేట్ రూ. 55,850 వద్ద మరియు 24K గోల్డ్ రేట్ రూ. 60,930 వద్ద కొనసాగుతున్నాయి.
ఎప్పటి లాగానే ఈరోజు కూడా చెన్నై మార్కెట్ లో గోల్డ్ రేట్ గరిష్ట రేట్ ను నమోదు చేసింది. ఈరోజు చెన్నై మార్కెట్ లో 10 గ్రాముల 24K బంగారం ధర రూ. 61,580 రూపాయల రేటును నమోదు చెయ్యగా 10 గ్రాముల 22K గోల్ రేట్ ఈరోజు రూ. 56,450 వద్ద ముగిసింది.
గమనిక: ఇక్కడ అందించిన ఆన్లైన్ ధరలు మరియు లోకల్ మార్కెట్ ధరల్లో మార్పులు సంభవించవచ్చు.