Gold Rate Hiked: ఘోరంగా పెరిగిన బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!
ఈరోజు బంగారం ధర ఘోరమైన రేటును నమోదు చేసింది
పసిడి ప్రియులకు కంట తడి పెట్టిస్తున్న గోల్డ్
64 వేల రేటును మరొకసారి టచ్ చేసిన గోల్డ్ మార్కెట్
Gold Rate Hiked: భారత మార్కెట్ లో ఈరోజు బంగారం ధర ఘోరమైన రేటును నమోదు చేసింది. ఇప్పటికే పసిడి ప్రియులకు కంట తడి పెట్టిస్తున్న గోల్డ్ రేట్, ఇప్పుడు అందనంత ఎత్తుకు చేరుకుంది. గడిచిన మూడు రోజుల్లోనే బంగారం ధర తులానికి రూ. 750 రూపాయలు పెరిగింది. అంతేకాదు, ఈ గ్రాఫ్ న్యూ ఇయర్ వరకూ ఇలాగే కొనసాగే అవకాశం ఉండవచ్చని చెబుతున్న మాటలు మార్కెట్ ను మరింత వేడెక్కిస్తున్నాయి. మరి ఈరోజు భారత గోల్డ్ మార్కెట్ ఎలా వుంది మరియు లేటెస్ట్ లైవ్ రేట్ వివరాలప్ పైన ఒక లుక్కేద్దామా.
Gold Rate Hiked
ఈరోజు బంగారం ధర హైయెస్ట్ రేటును టచ్ చేసింది. డిసెంబర్ 4వ తేదీ గోల్డ్ మార్కెట్ 64 వేల రూపాయల మార్క్ ను టచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈరోజు అంత కంటే మరింత ఎక్కువ రేటును గోల్డ్ మార్కెట్ నమోదు చేసింది. ఈరోజు గోల్డ్ మార్కెట్ మార్కెట్ తులానికి రూ. 64,250 రూపాయల రేటును నమోదు చేసింది. డిసెంబర్ నెలలో 64 వేల రేటును మరొకసారి టచ్ చేసి మరొక రికార్డ్ సెట్ చేసింది.
24 క్యారెట్ బంగారం ధర
ఈరోజు 24 క్యారెట్ బంగారం ధర వివరాల్లోకి వెళితే, ఈరోజు ఉదయం రూ. 63,820 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 64,250 రూపాయల వద్ద క్లోజింగ్ సెట్ చేసింది. అంటే, ఈరోజు గోల్డ్ రేట్ రూ. 430 రూపాయల పెరుగుదలను చూసింది మరియు ఈ 2023 సంవత్సరం గరిష్టాన్ని సెట్ చేసింది.
Also Read : iQOO Z7 Pro 5G పైన ధమాకా ఆఫర్ ప్రకటించిన అమేజాన్.!
22 క్యారెట్ బంగారం ధర
ఇక 22 క్యారెట్ బంగారం ధర వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయం రూ. 58,500 వద్ద మొదలైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 58,900 వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. ఈరోజు 22 క్యారెట్ గోల్ రేట్ తులానికి రూ. 400 రూపాయల పెరిగింది.
డిసెంబర్ 2023 గోల్డ్ మార్కెట్
ఇక డిసెంబర్ 2023 గోల్డ్ మార్కెట్ అప్డేట్ ను చూస్తే, ఈ నెల బంగారం ధర ప్రారంభం నుండి 62 వేల రూపాయల నుండి 64 వేల మధ్యలో కొనసాగింది. డిసెంబర్ 4 వ తేదీ మరియు డిసెంబర్ 28 వ తేదీ గోల్డ్ మార్కెట్ 64 వేల రూపాయల పైన రేటును చూసింది.