Gold Rate: జూన్ 10 తేదీ నుండి గత వారం రోజులుగా క్రిందకు దిగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పెరుగుదలను నమోదు చేసింది. నిన్న కూడా మార్కెట్ లో గోల్డ్ రేట్ నష్టాలను చూసింది మరియు నిన్న మూడు నెలల కనిష్ఠాన్ని కూడా బంగారం ధర చూసింది. అయితే, ఈరోజు గోల్డ్ రేట్ స్వల్పంగా పెరగడంతో మళ్ళీ తిరిగి 60 వేల మార్క్ ను దాటింది. ఈరోజు, అనగా జూన్ 16 న గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో తెలుసుకోండి.
నిన్న ప్రధాన మార్కెట్ లో రూ. 60,050 వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్ రూ. 380 రూపాయలు క్రిందకు దిగి రూ. 59, 670 రూపాయల వద్ద ముగిసింది. అయితే, ఈరోజు మాత్రం రూ. 59, 670 వద్ద మొదలైన 10గ్రాముల స్వచ్ఛమైన 24K గోల్డ్ రేట్ రూ. 440 రూపాయలు పెరిగి రూ. 60,110 రూపాయల వద్ద కొసాగుతోంది మరియు 22K ఆర్నమెంట్ గోల్డ్ రేట్ రూ. 55,100 వద్ద కొనసాగుతోంది.
గత వారం రోజుల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, జూన్ 10 న రూ. 60,550 వద్ద మొదలైన గోల్డ్ రేట్ రూ. 60,110 రూపాయల వద్ద కొసాగుతోంది. అంటే, ఓవరాల్ గా ఈ వారం రోజుల నిడివిలో గోల్డ్ రేట్ నష్టాలనే చవి చూసింది. అయితే, మార్చి నెల క్లోజింగ్ తో పోలిస్తే మాత్రం దాదాపుగా 500 రూపాయల ఎగువనే గోల్డ్ రేట్ కొనసాగుతోంది.
ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లలో గోల్డ్ మార్కెట్ అప్డేట్ ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 60,550 వద్ద మరియు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 55,100 వద్ద కొనసాగుతోంది.