Gold Rate: అనుకున్నదే అయ్యింది..భారీగా పెరిగిన బంగారం ధర.!
గత 7 రోజులుగా బంగారం ధర నేల చూపులు చూసింది
ఈరోజు గోల్డ్ రేట్ ఒక్కసారిగా పెరుగుదలను చూసింది
గోల్డ్ ఇన్వెస్టర్లకు కొంత ఊరటను కూడా గోల్డ్ మర్కెట్ అందించింది
Gold Rate: గత 7 రోజులుగా బంగారం ధర నెల చూపులు చూసింది మరియు ఈ నెల కనిష్ఠాన్ని కూడా నమోదు చేసింది. అయితే, గోల్డ్ రేట్ లో పెరుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతూనే ఉన్నారు. చెప్పినట్లుగానే ఈరోజు గోల్డ్ రేట్ ఒక్కసారిగా గ్రాముకు 100 రూపాయల పెరుగుదలను చూసింది. మరింతగా ఈ నెల గోల్డ్ మార్కెట్ రేట్ ను పరిశీలిస్తే, ఈ నెల గోల్డ్ రేట్ విచిత్రమైన ట్రెండ్ ను చూసింది. ఎందుకంటే, ఈ నెల ఒకరోజు భారీగా నష్టాలను చూస్తే, వెను వెంటనే భారీ లాభాలను కూడా చూసింది.
Today Gold Rate Update
ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ఉదయం రూ. 61,800 రూపాయల కనిష్ట ధర వద్ద ప్రారంభమైన బంగారం ధర సాయంత్రానికి తులానికి రూ. 1,090 రూపాయలు లాభాన్ని చూసి రూ. 62,890 రూపాయల క్లోజింగ్ ను సెట్ చేసింది. అంటే, ఈరోజు గ్రాముకు 109 రూపాయల పెరుగుదలను చూసింది.
అంతేకాదు, గోల్డ్ ఇన్వెస్టర్లకు కొంత ఊరటను కూడా గోల్డ్ మర్కెట్ అందించింది. గత 10 రోజులు నుండి భారిగా నష్టాలను చూస్తున్న మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకోవడం మరియు రేట్ ను స్థిరం చేయడం ద్వారా కొంత ఊరట ఇన్వెస్టర్లకు అందించింది.
ఈరోజు మార్కెట్ లో 24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు ప్రధాన మార్కెట్ లో నడుస్తున్న 24 క్యారెట్ బంగారం ధరను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 62,890 రూపాయల రేటు వద్ద నిలిచింది. ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 1,090 రూపాయల పెరుగుదలను చూసింది.
ఈరోజు మార్కెట్ లో 22 క్యారెట్ గోల్డ్ రేట్
ఇక ఈరోజు కొనసాగుతున్న 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగార ధరను పరిశీలిస్తే, ఈరోజు 10 రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ రేట్ రూ. 57,650 రూపాయల వద్ద నిలిచింది. ఒక తులం 22 క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు రూ. 1,000 రూపాయలు పెరిగింది.