గత వరం రోజులుగా మాక్రెట్ లో పెరుగుతూ పోతున్న Gold Rate ఈరోజు కూడా పెరిగింది. గడిచిన వారం రోజుల్లో నిన్నటి వరకూ రూ. 1,300 రూపాయలకు పైగా పెరిగిన బంగారం ధర, ఈరోజు రూ. 380 రూపాయలు పెరిగింది. అంతేకాదు, ఈరోజు గోల్డ్ రేట్ 59 వేల మార్క్ వద్దకు చేరుకుంది మరియు ఇన్వెస్టర్లకు ఈరోజు కూడా లాభాల బాటను చూపించింది. అంతేకాదు, దీపావళి పండుగ నాటికి గోల్డ్ రేట్ 60 వేల రూపాయల మార్క్ ను దాటవచ్చనే మాటను నిజం చేసేలా కనిపిస్తోంది.
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 58,530 రూపాయల వద్ద మొదలై తులానికి రూ.380 రూపాయల పెరుగుదలను నమోదు చేసి రూ. 58,910 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు తెలుగు రాష్టాల మార్కెట్ లో కొనసాగుతున్న 24 Carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 58,530 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 380 రూపాయలు పెరిగి రూ. 58,910 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read : Nokia G42 5G స్మార్ట్ ఫోన్ New 16GB RAM వేరియంట్ లాంచ్..ధర ఎంతంటే.!
ఒక 22 Carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 53,650 రూపాయల వద్ద మొదలైన 22 Carat బంగారం ధర రూ. 350 రూపాయలు పెరిగి రూ. 54,000 రూపాయల వద్ద కొజింగ్ ను సెట్ చేసింది.
ఒక గడిచిన 10 రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్ ను పరిశీలిస్తే గోల్డ్ రేట్ భారీగా పెరుగుదలను నమోదు చేసినట్లు చూడవచ్చు. అక్టోబర్ 4వ తేదీ రూ. 57,160 వద్ద ఉన్న బంగారం ధర ఈరోజు రూ. 58,910 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, గడిచిన 10 రోజుల్లో బంగారం ధర రూ. 1,750 రూపాయల పెరిగింది.
గమనిక : ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ బంగారం ధరలలో మార్పులు ఉంటాయి.