Gold Rate: Diwali 2023 దెబ్బకి భారీగా పెరిగిన బంగారం ధర | New Update
దీపావళి మొదటి రోజైన దంతెరస్ దెబ్బకి బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి
గోల్డ్ కొనుగోళ్లు భారీగా పెరిగిపోవడంతో Gold Rate అమాంతం పెరిగిపోయింది
ఈరోజు గోల్డ్ మార్కెట్ మరియు రేట్ అప్డేట్స్ పైన ఒక లుక్కేద్దామా
Gold Rate: దీపావళి మొదటి రోజైన దంతెరస్ దెబ్బకి బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దంతేరస్ నాడు బంగారం కొనడాన్ని శుభ సూచికంగా భావిస్తారు భారతీయులు. అందుకే, ఈరోజు గోల్డ్ కొనుగోళ్లు భారీగా పెరిగిపోవడంతో బంగారం రేటు అమాంతం పెరిగిపోయింది. వాస్తవానికి, గడిచిన 10 రోజుల్లో గోల్డ్ మార్కెట్ భారీ నష్టాలను చూసింది. అయితే, ఈరోజు మాత్రం లాభాల బాటలో సాగడంతో బంగారం ధర మళ్ళి తిరిగి 61 వేల మార్క్ ను చేరుకుంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ మరియు రేట్ అప్డేట్స్ పైన ఒక లుక్కేద్దామా.
Todays Gold Rate:
ఈరోజు మార్కెట్ లో కొనసాగిన బంగారం రేటు వివరాల్లోకి వెళితే, ఈరోజు రూ. 60,760 రూపాయల వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్ తులానికి రూ. 330 రూపాయల పెరుగుదలను చూసి రూ. 61,090 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం రేటు ను పరిశీలిస్తే,ఉదయం రూ. 60,760 వద్ద మొదలైన బంగారం ధర రూ. 330 రూపాయలు పైకి ఎగబాకి రూ. 61,090 రేటు వద్ద స్థిరంగా నిలబడింది.
Also Read : Amazon Sale చివరి రోజు Nokia G42 5G పైన భారీ డిస్కౌంట్ అందించింది.!
22 Carat గోల్డ్ రేట్
ఇక 22 Carat గోల్డ్ రేట్ రేటు విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22 Carat గోల్డ్ రేట్ రూ. 55,700 రూపాయల వద్ద ప్రారంభమై రూ. 300 రూపాయలు లాభాన్ని చూసి రూ. 56,000 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది.
నవంబర్ గోల్ రేట్
నవంబర్ 2023 నెల ప్రారంభం నుండి కొనసాగిన గోల్ రేట్ ను పరిశీలిస్తే, బంగారం ధర ఈ నెల ప్రారంభం నుండి కూడా నష్టాలనే చూసింది. గడిచిన 3 రోజుల్లోనే బంగారం ధర 700 రూపాయలకు పైగా నష్టాలను చూసిందంటే మనం అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, నిన్న నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్ 60 వేల మార్క్ దిగువకు చేరుకుంది.
గమనిక : ఆన్లైన్ మార్కెట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించాలి.