Gold Rate Today: ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఊహకందనంతా భారీగా పెరిగిపోయింది. ఈ ఆల్ టైం గరిష్ట ధరను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, ఈరోజు రికార్డు స్థాయి రేటుని నమోదుచేసి. గోల్డ్ రేట్ ఈరోజు ఏకంగా 1400 రూపాయల భారీ హైక్ ను హిట్ చేసింది. దీని దెబ్బకి బంగారం ధర 68 వేల మార్కు పైకి చేరుకుంది. మరి ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ అప్డేట్ మరియు బంగారం ధర వివరాలను తెలుసుకుందామా.
నిన్న హైయెస్ట్ రేటు వద్ద క్లోజింగ్ నమోదు చేసిన గోల్డ్ రేట్ ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభమవుతూనే మరింతగా దూసుకు వెళ్ళింది. ఉదయం మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్, రూ. 1,420 పెరుగుదలను నమోదు చేసి 68 వేల రూపాయల మార్క్ అంచుకి చేరుకుంది.
ఇక గత వారంతో పోలిస్తే, బంగారం ధర ఈ వారంలో భారీ పెరుగుదలను నమోదు చేసినట్లు గమనించవచ్చు. అంతేకాదు, ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎన్నడూ చూడనటువంటి హైయెస్ట్ రేటును హిట్ చేసింది. మొత్తంగా చూస్తే ఈ వారంలో బంగారం ధర రూ. 2,020 రూపాయల భారీ పెరుగుదలను నమోదు చేసింది.
Also Read: 6 వేలకే 100 ఇంచ్ స్క్రీన్ Smart Projector లాంఛ్ చేసిన టాప్ బ్రాండ్.!
ఇక ఈరోజు మార్కెట్ లో నమోదైన గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 68,730 వద్ద క్లోజింగ్ నమోదు చేసింది. ఈరోజు మార్కెట్ లో ఒక తులం 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 1,040 రూపాయలు పెరిగింది.
ఇక 24 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు రూ. 63,000 వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. అంటే, ఈరోజు ఒక తులం 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 1,300 రూపాయల పెరుగుధలను సెట్ చూసింది.