Gold Rate Hiked: మార్కెట్లో ఈరోజు బంగారం ధర దారుణంగా పెరిగిపోయింది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న పసిడి ప్రియుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. ఈరోజు మార్కెట్ లో హైయెస్ట్ రేటు వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్ భారీ పెరుగుదలను చూడటంతో ఈరోజు మరొక కొత్త రికార్డును నమోదు చేసింది. మార్కెట్ నిపుణులు చెబుతున్న మాటలను నిజం చేస్తూ బంగారం ధర ఈరోజు 73 వేల రూపాయల పైన కొనసాగింది.
ఈరోజు మార్కెట్లో బంగారం ధర ₹1000 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. వారం ప్రారంభం నుండి పెరిగిన గోల్డ్ రేటును చూస్తే పసిడి ప్రియులకు పూర్తిగా నిరాశ కలుగుతుంది. అయితే, గోల్డ్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టింది గోల్డ్ మార్కెట్.
ఈ వారం మొత్తం కొనసాగిన గోల్డ్ రేటు వివరాల్లోకి వెళితే, గడిచిన ఐదు రోజుల్లో బంగారం ధర 2 వేల రూపాయల వరకూ భారీ పెరుగుదలను చూసింది. ఇక ఈ నెలలో ఇప్పటి వరకూ కొనసాగిన గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే దారుణమైన పెరుగుదలను నమోదు చేసినట్లు మనం గమనించవచ్చు.
ఈవారం ప్రారంభంలో రూ. 71,620 వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్ ఈరోజు రూ. 73,310 రూపాయల క్లోజింగ్ ను చూసింది. అలాగే, ఈ నెల ప్రారంభంలో బంగారం ధర రూ. 69,380 రూపాయల వద్ద గోల్డ్ రేట్ ప్రారంభమయ్యింది. దీని బట్టి మీరు గోల్డ్ రేట్ పెరుగుదలను అంచనా వేయవచ్చు.
Also Read: OTT Release: ఈరోజు నుండి మొదలైన premalu మరియు Gaami స్ట్రీమింగ్.!
ఈరోజు మార్కెట్ 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 72,220 వద్ద ప్రారంభమై రూ. 73,310 వద్దకు చేరుకుంది. అంటే, ఈరోజు రూ. 1,090 రూపాయల భారీ పెరుగుదలను చూసింది గోల్డ్ మార్కెట్.
ఇక ఇక ఈరోజు మార్కెట్లో కొనసాగిన 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 66,200 రూపాయల స్టార్ట్ అయ్యి రూ. 67,200 వద్దకు చేరుకుంది. అంటే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 1,000 రూపాయలు పెరిగింది.