Gold Rate: వరుసగా 4 వ రోజు కూడా పెరిగిన బంగారం ధర.!
గత వారం మొత్తం కనిష్టంలో కొనసాగిన బంగారం ధర
ఈ వారం మాత్రం వరుసగా పెరుగుతూ వచ్చింది
ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి
గత వారం మొత్తం కనిష్టంలో కొనసాగిన బంగారం ధర, ఈ వారం మాత్రం వరుసగా పెరుగుతూ వచ్చింది. అయితే, నాలుగు రోజులు వసరుసగా పెరిగిన తరువాత కూడా బంగారం ధర ఇప్పటికీ 60 వేల రూపాయల కంటే క్రిందనే కొనసాగుతోంది. అయితే, నాలుగు నెలల కనిష్ఠాన్ని చూసిన తరువాత పెరగడం మొదలుపెట్టింది. ఈరోజు బంగారం ధర ఎలా కొనసాగుతోంది మరియు ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
Gold Rate:
ఈరోజు దేశంలో ప్రధాన మార్కెట్ లో తులానికి 220 రుపాయల పెరుగుదలను నమోదు చేసింది గోల్డ్ రేట్. ఈరోజు ఉదయం రూ. 59 230 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ రేట్ రూ. 220 రూపాయలు పైకి ఎగబాకి మార్కెట్ ముగిసే సమయానికి రూ. 59,450 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
అలాగే, రూ. 54, 300 రుపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22K ఆర్నమెంట్ బంగారం ధర ఈరోజు మార్కెట్ ముగిసే సమయానికి రూ. 200 రుపాయలు పైకి ఎగబాకి రూ. 54, 500 రుపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఇక ఈ వారం గోల్డ్ రేట్ వివరాలను పరిశీలిస్తే, వారం ప్రారంభంలో రూ. 59,020 వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్ ఈరోజు వరకూ కూడా తులానికి రూ. 430 రూపాయలు పెరిగి రూ. 59,450 రూపాయల వద్ద కొనసాగుతోంది.
సూచన: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.