Gold Rate: భారీగా పెరిగి తగ్గిన బంగారం ధర..ఈరోజు లైవ్ రేటు ఎంతంటే.!

Updated on 30-Nov-2023
HIGHLIGHTS

Gold Rate: బంగారం ధర అనుకోని మలుపులను చూస్తోంది

గోల్డ్ మార్కెట్ ఈ సంవత్సరం గరిష్ట రేటును నిన్న నమోదు చేసింది

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ మళ్ళీ క్రిందకు దిగింది

Gold Rate: బంగారం ధర అనుకోని మలుపులను చూస్తోంది. ఈ నెల గోల్డ్ మార్కెట్ ఈ సంవత్సరం గరిష్ట రేటును నిన్న నమోదు చేసింది. నవంబర్ 29 న గోల్డ్ మార్కెట్ ఒక్కరిసారిగా తులానికి రూ. 820 రూపాయలను చూడటంతో రూ. 63,380 రూపాయల గరిష్టాన్ని తాకింది. ఇది గత 18 నెలల గరిష్ట ధర కూడా అవుతుంది. అయితే, ఈరోజు మార్కెట్ లో గోల్ రేట్ మళ్ళీ క్రిందకు దిగింది మరియు పాట రేటును చేరుకుంది. ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ అప్డేట్ మరియు లైవ్ రేట్ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

Today Gold Rate

ఈరోజు ప్రధాన మార్కెట్ లో బంగారం ధర తులానికి రూ. 650 రూపాయలు క్రిందకు దిగింది. ఈరోజు ఉదయం రూ. 63,380 రూపాయల వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్ సాయంత్రానికి రూ. 650 రుపాయల నష్టాన్ని చవిచూసి రూ. 62,730 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.

Also Read : Fire-Boltt Lumos: అతి తక్కువ ధరలో స్టైన్ లెస్ స్టీల్ లగ్జరీ స్మార్ట్ వాచ్ వచ్చేసింది.!

ఈ వారం గోల్డ్ రేట్

ఇక ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్ ను పరిశీలిస్తే, ఈ వారం బంగారం ధర 18 నెలల గరిష్టాన్ని కూడా చూసింది. నవంబర్ 27వ తేదీ రూ. 62,290 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర గడిచిన నాలుగు రోజుల్లో రూ. 1,070 రూపాయల పెరుగుదలను చూసి, నవంబర్ 39 న రూ. 63,380 రూపాయల గరిష్ట ధరను నమోదు చేసింది.

ఈరోజు గోల్డ్ మార్కెట్

అయితే, ఈరోజు గోల్డ్ మార్కెట్ తులానికి రూ.650 రూపాయలు పడిపోవడంతో ఈరోజు రూ. 62,730 రూపాయల వద్ద మార్కెట్ ముగిసింది. అయితే, ఈ నెలలో గోల్డ్ మార్కెట్ ఓవరాల్ గా లాభాల బాటలోనే నడిచింది. అంతేకాదు, నిపుణులు ఊహించిన విధంగా గోల్డ్ రేట్ ఎట్టకేలకు 63 వేల రూపాయల మార్క్ ను దాటింది.

గోల్డ్ మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని మళ్ళీ చేస్తున్న నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. అయితే, గోల్డ్ రేట్ స్టేబుల్ గా వుంటుందా లేదా ఒక్కసారిగా పెరుగుతుందా అనేది వేచిచూడాలి.

గమనిక: ఆన్లైన్ గోల్డ్ మరియు లోకల్ మార్కెట్ గోల్ రేట్ లలో మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :