Gold Rate: గత కొన్ని రోజులుగా భారీగా లాభాలను చూసిన గోల్డ్ ఈరోజు చరిత్రను తిరగరాసింది. నవంబర్ నెల మొత్తం పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్, ఈరోజు ఏకంగా 64 వేల రూపాయల మార్క్ ను దాటింది. గడిచిన 10 రోజుల్లోనే బంగారం ధర రూ. 2,500 రూపాయల కంటే పైనే పెరుగుధలను చూసింది. ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ లాభాల బాటలోనే నడిచింది. గడిచిన 10 రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్ లతో పాటుగా ఈరోజు గోల్డ్ రేట్ క్లోజింగ్ వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.
ప్రస్తుతం మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ఉదయం రూ. 63,760 రూపాయల వద్ద మొదలైన ఒక తులం బంగారం ధర రూ. 440 రూపాయల పెరుగుదలను చూసి రూ. 64,200 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు 24 Carat బంగారం ధర వివరాల్లోకి వెళితే, ఈరోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 63,760 రూపాయల వద్ద మొదలై రూ. 64,200 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అంటే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 440 రూపాయలు పెరిగింది. అంతేకాదు, ఈరోజు గోల్డ్ మార్కెట్ ఆల్ అత్యంత గరిష్ట రేటును చేరుకుంది.
Also Read : Tecno Spark Go 2024: రూ. 6,699 ధరకే డ్యూయల్ DTS స్పీకర్లతో కొత్త ఫోన్ వచ్చేసింది.!
ఇక 24 Carat బంగారం ధర రేటును పరిశీలిస్తే, ఈరోజు రూ. 58,450 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర రూ. 58,850 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అంటే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 400 పెరుగుదలను నమోదు చేసింది.
ఇక గడిచిన 10 రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్ విషయానికి వస్తే, నవంబర్ 25న రూ. 62,290 రూపాయల వద్ద గోల్డ్ రేట్ మొదలయ్యింది. అయితే, గదించిం 10 రోజుల్లో మొత్తంగా రూ.1,910 రూపాయల భారీ పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్ పసిడి ప్రియులకు అందనంత ఎత్తుకు చేరుకుంది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రూట్ లలో మార్పులు ఉంటాయి.