Gold: ప్రియమౌతున్న పసిడి.. ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!

Updated on 09-Nov-2022
HIGHLIGHTS

Gold: ఈరోజు గోల్డ్ మార్కెట్ సూచీలు పైపైకి చూస్తున్నాయి

ఈరోజు మార్కెట్ మొదలవుతూనే బంగారం ధర పుంజుకుంది

ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగుతోందో చూడండి

Gold: ఈరోజు గోల్డ్ మార్కెట్ సూచీలు పైపైకి చూస్తున్నాయి. రెండు క్రితం ఒక్కసారిగా తులానికి 1,000 రూపాయల వరకు పెరిగిన బంగారం ధర, గడిచిన రెండు రోజుల్లో స్థిరంగా కొనసాగింది. అయితే, ఈరోజు మార్కెట్ మొదలవుతూనే బంగారం ధర పుంజుకుంది. ఈ నెల ప్రారంభంలో తులం రూ.50,780 రూపాయల వద్ద ఉన్నగోల్డ్ రేట్, ఈరోజు రూ.52,670 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ నెల గోల్డ్ మార్కెట్ సూచీలు పైపైకే వెళుతున్నట్లు మనం చూడవచ్చు. అయితే, నవంబర్ 4న తులం రూ.50,290 రూపాయల వద్దకు చేరుకొని ఈ నెల కనిష్ఠాన్ని కూడా నమోదు చేసింది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగుతోందో చూడండి.

Gold:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,800 రూపాయలుగా ఉండగా, ఈరోజు 560 రూపాయలు పెరిగి రూ.47,360 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.51,670 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,670 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,670 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,460 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,780 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,530 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :