Gold: స్థిరంగా బంగారం ధర ..ఈరోజు గోల్డ్ మార్కెట్ వివరాలు ఇవే.!

Gold: స్థిరంగా బంగారం ధర ..ఈరోజు గోల్డ్ మార్కెట్ వివరాలు ఇవే.!
HIGHLIGHTS

దీపావళి ముందు భారీగా పెరిగిన బంగారం ధర

పండుగ తరవాత మరలా తిరిగి తగ్గుముఖం పట్టింది

ప్రస్తుతం బంగారం ధర మార్కెట్ లో స్థిరంగానే కనిపిస్తోంది

దీపావళి ముందు భారీగా పెరిగిన బంగారం ధర, పండుగ తరవాత మరలా తిరిగి తగ్గుముఖం పట్టింది. అయితే, ప్రస్తుతం బంగారం ధర మార్కెట్ లో స్థిరంగానే కనిపిస్తోంది. గత మూడు రోజులుగా స్వల్పంగా మార్పులే తప్ప మొత్తంగా గోల్డ్ మార్కెట్ స్థిరంగానే వుంది. ఇక నెల మొత్తం గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే తులం గోల్డ్ ధర 50 వేల రూపాయల నుండి 51 వేల రూపాయల చుట్టూనే చక్కర్లు కొడుతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగుతుందో పరిశీలిద్దామా.

Gold:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,100 రూపాయలుగా ఉండగా, ఈరోజు కూడా స్థిరంగా కొనసాగిన గోల్డ్ మార్కెట్ 47,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,380 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,390 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,530 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 గా ఉంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo