దిగొచ్చిన బంగారం ధర..ఎంత తగ్గిందంటే.!

Updated on 08-May-2023
HIGHLIGHTS

బంగారం ధర రెండు ఈరోజుల క్రితం రికార్డ్ స్థాయి రేటును టచ్ చేసింది

ఈ రోజు భారీగా తగ్గిన బంగారం ధర

ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి

బంగారం ధర రెండు ఈరోజుల క్రితం రికార్డ్ స్థాయి రేటును టచ్ చేసింది. అయితే, వెంటనే తరువాతి రోజు భారీగానే తరుగుధలను నమోదు చేసింది గోల్డ్ మార్కెట్. కానీ, ఇప్పటికీ గోల్డ్ రేట్ సామాన్య ప్రజలకు చేరువలో లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ వారం గోల్డ్ రేట్ వివరాలు, ఈరోజు మార్కెట్ ప్రైస్ మరియు తెలుగురాష్ట్రాల ప్రధాన నగరాల మార్కెట్ లో ఈరోజు బంగారం ధర వంటి  కంప్లీట్ వివరాలను తెలుసుకుందామా. 

ఈ వారం గోల్డ్ మార్కెట్

ఈ వారం గోల్డ్ మార్కెట్ లాభాలను నమోదు చేసింది. ఈ వారం స్టార్టింగ్ (మే 1) లో 24K 10గ్రా గోల్డ్ రేట్ రూ. 60,760 వద్ద ప్రారంభమైన గోల్డ్ నాలుగు రోజుల్లో 1,700  వరకూ పెరిగి మే 5 న రూ. 62,200 రూపాయలతో హై ఎస్ట్ రేట్ ను నమోదు చేసింది. అయితే, మే 6న తులానికి 760 రూపాయలు దిగివచ్చిన గోల్డ్ రూ. 61,640 రేటు వద్ద మార్కెట్ క్లోజింగ్ నమోదు చేసింది. అలాగే, 22K గోల్డ్ రేట్ రూ. 55,700 నుండి మొదలై రూ. 57,200 వద్దకు పెరిగి నిన్న వారాంతంలో రూ. 56,500 వద్ద ముగిసింది. 

ఈరోజు గోల్డ్ అప్డేట్

ఈరోజు ఒక తులం 24K బంగారం ధర రూ. 61,640 రూపాయల వద్ద ఉండగా, 22K గోల్డ్ రేట్ రూ. 56,500 వద్ద వుంది. శనివారం రోజు గోల్ మార్కెట్ తులానికి 700 పైగా నష్టాన్ని చూసింది.

తెలుగు రాష్టలలో గోల్డ్ రేట్

ఇక ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు ఈ రెండు నగరాలలో కూడా 10గ్రా 24K గోల్డ్ రేట్ రూ. 61,640 గా ఉండగా, 10 గ్రా 22K గోల్డ్ రేట్ రూ. 56,500 గా వుంది. 

గమనిక: ఆన్లైన్, ఆఫ్ లైన్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో వ్యత్యాసాలు ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :