Gold Rate: ఈరోజు కూడా క్రిందకు దిగిన బంగారం ధర.!

Updated on 12-Oct-2022
HIGHLIGHTS

ఈరోజు కూడా మార్కెట్లో బంగారం ధర క్రిందకు దిగజారింది

బంగారం ధర ప్రస్తుతం మెల్లమెల్లగా క్రిందకు దిగుతోంది

నిన్న ఒక్కరోజే 700 కు పైగా తగ్గిన Gold Rate

Gold Rate: ఈరోజు కూడా మార్కెట్లో బంగారం ధర క్రిందకు దిగజారింది. నిన్న మొన్నటి వరకూ కొండెక్కి కూర్చున్న బంగారం ధర ప్రస్తుతం మెల్లమెల్లగా క్రిందకు దిగుతోంది. నిన్న ఒక్కరోజే 700 కు పైగా తగ్గిన బంగారం ధర ఈరోజు కూడా అదే దారిలో కొనసాగింది. ఈరోజు మార్కెట్ లో గోల్డ్ తులానికి 270 రూపాయల తరుగుదలను నమోదు చేసింది. అంటే, ఈరెండు రోజుల్లోనే బంగారం తులానికి 1000 కు పైగా రేటును కోల్పోయింది. మరి ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో పరిశీలిద్దామా.        

Gold Rate:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,900 రూపాయలుగా ఉండగా, ఈరోజు 250 రూపాయలు క్రిందకు దిగజారి 46,650 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,890 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,060 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.50,870 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 గా ఉంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :