Gold Price: వరుసగా మూడవ రోజు కూడా పడిపోయిన గోల్డ్ రేట్.!
వరుసగా మూడవ రోజు కూడా పడిపోయిన గోల్డ్ రేట్
గోల్డ్ ఈ వారంలో ప్రస్తుతం 60 వేల మార్క్ వద్దకు చేరుకుంది
మార్కెట్ అప్డేట్ మరియు ఇతర వివరాలు పైన ఒక లుక్కేయండి
GoldPrice: వరుసగా మూడవ రోజు కూడా పడిపోయిన గోల్డ్ రేట్. మే 15, సోమవారం మరియు మే 16వ తేది మంగళ వారం రెండు రోజులు కూడా నిలకడగా కొనసాగిన గోల్డ్ మార్కెట్ మే 17వ తేదీ బుధవారం నుండి ఈరోజు వరకూ కూడా వరుసగా నష్టాల బాటలోనే సాగింది. గత వారం 62 వేల క్లోజింగ్ వద్ద నిలిచిన గోల్డ్ ఈ వారంలో ప్రస్తుతం 60 వేల మార్క్ వద్దకు చేరుకుంది. ఈరోజు లైవ్ అప్డేట్, మార్కెట్ అప్డేట్ మరియు ఇతర వివరాలు పైన ఒక లుక్కేయండి.
Gold Price Today:
ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ లైవ్ అప్డేట్ ను చూస్తే, (10గ్రా) 24K గోల్డ్ రేట్ రూ. 61,200 వద్ద మొదలై 330 రూపాయల నష్టాన్ని చూసి, రూ. 60,870 వద్ద ముగిసింది. అలాగే, (10గ్రా) 22K ఆర్నమెంట్ గోల్డ్ రేట్ కూడా 300 రూపాయల నష్టాన్ని చూసి రూ. 55,800 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Gold Market:
ఇక ఈ వారం గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, మే 15న రూ. 56, 650 వద్ద మొదలైన ఒక తులం 22క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు రూ. 55,800 వద్ద ముగింది. అలాగే, రూ. 61,800 మొదలైన 24K గోల్డ్ రేట్ రూ. 60,870 రేటు వద్ద ముగిసింది. అంటే, ఈ వారంలో దాదాపుగా రూ. 1,000 వరకు గోల్డ్ రేట్ క్రిందకు దిగింది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేట్ వివరాలు చూస్తే, ఈరోజు హైదరాబాద్, వైజాక్ మరియు విజయవాడ లలో 10 గ్రాముల 22K బంగారం ధర రూ. 60,870 గా ఉండగా 10 గ్రాముల 22K బంగారం ధర రూ. 55,800 గా వుంది.
ఈరోజు కూడా చెన్నై మరియు మదురై మార్కెట్ లలో గోల్డ్ రేట్ అధికంగా వుంది. ఈరోజు చెన్నై మరియు మధురై మార్కెట్ లో ఒక తులం 24K గోల్డ్ రూ. 61,360 రేటుతో కొనసాగుతుండగా, ఒక తులం 22K గోల్డ్ రేట్ రూ. 56,260 వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ మార్కెట్ రేట్స్ మరియు లోకల్ గోల్డ్ మార్కెట్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.