మూడు రోజులుగా పడిపోతున్న గోల్డ్ రేట్.!

మూడు రోజులుగా పడిపోతున్న గోల్డ్ రేట్.!
HIGHLIGHTS

గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం గత మూడు రోజులుగా పడిపోతోంది

పదిరోజుల్లో రూ. 1000 క్రిందకు దిగిన గోల్డ్ రేట్

ఈరోజు గోల్డ్ మర్కెట్ క్రిందకు దిగింది

గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం గత మూడు రోజులుగా పడిపోతోంది. గత 10 రోజుల మార్కెట్ ను పరిశీలిస్తే, ఓవరాల్ గా బంగారం ధర నష్టాన్నే చవి చూసిందనే చెప్పాలి. ఎందుకంటే, ఏప్రిల్ 14 న రూ.61,800 వద్ద సాగిన 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ ఈరోజు రూ. 60, 710 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ పదిరోజుల్లో గోల్డ్ మార్కెట్ దాదాపుగా రూ. 1000 రూపాయల క్రిందకు దిగినట్లు మనం చూడవచ్చు. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు రేట్ వివరాలు చూద్దామా. 

Gold Market Update:

ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు ధర వివరాల్లోకి వెళితే, ఈరోజు 22 గ్రాముల 22K బంగారం ధర ప్రధాన మార్కెట్ లో రూ. 55,650 వద్ద కొనసాగుతుండగా, 24K క్యారెట్ 10గ్రాముల గోల్డ్ రేట్ రూ.60, 710 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈరోజు గోల్డ్ మర్కెట్ తులానికి 80 రూపాయలు క్రిందకు దిగింది. 
 
గోల్డ్ మార్కెట్ ఈ మూడు రోజుల్లో రూ. 440 రూపాయలు క్రిందకు దిగింది మరియు ఈరోజు కూడా అదే దారిలో కొనసాగుతోంది. 

ఈరోజు తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేట్ మరియు మార్కెట్ అప్డేట్ ల విహాస్యానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్ లలో గోల్డ్ మార్కెట్ దాదాపుగా ఒకే రేటుతో కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 55,650 రూపాయలు ఉండగా, 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ.60, 710 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈరోజు విజయవాడ మార్కెట్ లో కూడా ఇదే ధరను గోల్డ్ మార్కెట్ నమోదు చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo